కరోనా చికిత్సకు ప్లాస్మా థెరపీ.. కేరళ వినూత్న ప్రయోగం

కరోనా చికిత్సకు ప్లాస్మా థెరపీ.. కేరళ వినూత్న ప్రయోగం

కోవిడ్-19 సోకి తీవ్ర విషమ స్థితిలో ఉన్న రోగులకు ప్లాస్మా థెరపీ ఇఛ్చి వారిని మళ్ళీ ఆరోగ్యవంతులను చేసేందుకు కేరళ ప్రభుత్వం నడుం కట్టింది. అయితే ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నవారి రక్తంలోని యాంటీ బాడీలను వినియోగించుకోవలసి ఉంటుంది.

Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Apr 10, 2020 | 4:07 PM

కోవిడ్-19 సోకి తీవ్ర విషమ స్థితిలో ఉన్న రోగులకు ప్లాస్మా థెరపీ ఇఛ్చి వారిని మళ్ళీ ఆరోగ్యవంతులను చేసేందుకు కేరళ ప్రభుత్వం నడుం కట్టింది. అయితే ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నవారి రక్తంలోని యాంటీ బాడీలను వినియోగించుకోవలసి ఉంటుంది. ఈ థెరపీ క్లినికల్ ట్రయల్స్ కు శ్రీకారం చుట్టిన కేరళ ఈ తరహా ప్రయోగానికి దేశంలోనే తొలి రాష్ట్రం గా నిలిచింది. ఈ ప్రాజెక్టుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆమోదం తెలిపిందని  ఓ అధికారి వెల్లడించారు . తిరువనంతపురంలోని శ్రీచిత్ర తిరుణాల్ ఇన్స్ టి ట్యూట్ ఫర్ మెడికల్ అండ్ సైన్సెస్ టెక్నాలజీ ఈ దిశగా ప్రయోగాలు చేపడుతుందని ఆయన చెప్పారు. ఈ సంస్థ ఈ నెలాఖరు నుంచి ట్రయల్స్ ప్రారంభిస్తుందన్నారు. అయితే డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా, ఎథిక్స్ కమిటీ ఆమోదం లభించవలసి ఉంటుందన్నారు. ప్లాస్మా థెరపీకి సంబంధించి చైనా, అమెరికా దేశాల్లో కొంత అధ్యయనం జరిగింది. కానీ ఈ చికిత్సా విధానం బాగా పని చేస్తుందని ఇప్పుడే చెప్పలేం అన్నారాయన. కాగా కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న రోగులు స్వఛ్చందంగా తమ రక్తాన్ని ఇచ్చేందుకు ముందుకు రావలసి ఉంటుందని, మొదట వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తారని ఆ అధికారి వివరించారు. ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వంతో బాటు కేరళలోని అయిదు మెడికల్ కాలేజీలు ఆమోదించాయి.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu