అబద్దం చెప్పిన పిజ్జా డెలివరీ బాయ్.. అధికారుల ఉరుగులు, పరుగులు.. లాక్‌డౌన్‌లోకి వెళ్లిన రాష్ట్రం..

ఓ చిన్న అబద్ధం.. ఓ రాష్ట్రాన్నే ఇరకాటంలోకి నెట్టింది. తానిచ్చిన సమాచారంతో ఉన్నతాధికారులతో సహా అందరిని ఉరుగులు, పరుగులు పెట్టారు.

అబద్దం చెప్పిన పిజ్జా డెలివరీ బాయ్.. అధికారుల ఉరుగులు, పరుగులు.. లాక్‌డౌన్‌లోకి వెళ్లిన రాష్ట్రం..
Follow us

|

Updated on: Nov 20, 2020 | 8:15 PM

ఓ చిన్న అబద్ధం.. ఓ రాష్ట్రాన్నే ఇరకాటంలోకి నెట్టింది. తానిచ్చిన సమాచారంతో ఉన్నతాధికారులతో సహా అందరిని ఉరుగులు, పరుగులు పెట్టారు. పిజ్జా రెస్టారెంటు ఉద్యోగి చెప్పిన అబద్ధం.. 17.50 లక్షలకు పైగా జనాభా ఉన్న ఓ రాష్ట్రం మొత్తం మూతపడింది. సౌత్‌ ఆస్ట్రేలియా ప్రాంతం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. అసలు సంగతి తెలిసి అంతా ఉపిరి పీల్చుకున్నారు. వెంటనే తేరుకున్న ఆ రాష్ట్ర ప్రిమియర్‌.. లాక్‌డౌన్‌ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీచేశారు. ఓ వ్యక్తి అనాలోచిత చర్యతో మొత్తం రాష్ట్రాన్ని ఇబ్బందుల్లోకి వెళ్లిందని ప్రిమియర్‌ స్టీవెన్‌ మార్షల్‌ ప్రకటించారు. ఆ వ్యక్తి అధికారులకు నిజం చెప్పి ఉంటే లాక్‌డౌన్‌ పరిస్థితి తలెత్తేదే కాదన్నారు.

అడిలైడ్‌లో విదేశీయులు క్వారంటైన్ లో ఉండే ఓ హోటల్‌ సిబ్బందిగా పనిచేస్తున్న ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో వివరాలను తెలుసుకునేందుకు అధికారులు అతని ఇంటికి వచ్చారు. వారికి తాను వుడ్‌విల్లె పిజ్జా బార్‌లో పిజ్జా కొనుగోలు చేసేందుకు వెళ్లానని అబద్ధం చెప్పాడు. అయితే, అతడికి కరోనా ఎవరి వల్ల సోకిందో అర్థం కాక అధికారులు అయోమయానికి గురయ్యారు. వుడ్‌విల్లె పిజ్జా బార్‌ వినియోగదారులందరికీ కరోనా సోకే అవకాశముందని ఆందోళన చెందారు. దీంతో కరోనా అనుమానితులను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే, వందలాది మంది కస్టమర్లను పరీక్షించిన ఫలితం లేకపోయింది. ఈ కేసును ట్రేస్‌ చేయడంలో విఫలం కావడంతో అధికారులు కఠిన ఆంక్షలతో కూడిన లాక్‌డౌన్‌ను అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆరురోజుల పాటు నిర్బంధ లాక్‌డౌన్‌ అమలులో ఉంటుందని ఆ రాష్ట్ర ప్రిమియర్ ప్రకటించారు.

అయితే ఆ వ్యక్తి కొనుగోలుదారు కాదని.. పిజ్జా పార్లర్‌లో పార్ట్‌టైమ్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడని అనంతరం వెల్లడైంది. అంతేకాకుండా అక్కడ పనిచేసే ఓ సెక్యూరిటీ గార్డు వల్ల అతనికి కొవిడ్‌ సోకిందని కూడా తెలిపోయింది. దీంతో ఊపిరి పీల్చుకున్న సౌత్‌ ఆస్ట్రేలియా ప్రభుత్వం.. లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అక్కడ లాక్‌డౌన్‌ మూడురోజుల ముందే అంటే శనివారం అర్ధరాత్రి ముగియనుంది.

తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి