Corona Virus In Children : తల్లిదండ్రులు జాగ్రత్త..! పిల్లల్లో కరోనా వైరస్ ప్రారంభ లక్షణాలు ఇవే..? తెలుసుకోండి..
Corona Virus In Children : భారతదేశంలో కోవిడ్ -19 రెండో వేవ్ తగ్గుముఖం పట్టింది. కానీ మూడో వేవ్ ముప్పు మళ్ళీ ప్రారంభమవుతోంది.
Corona Virus In Children : భారతదేశంలో కోవిడ్ -19 రెండో వేవ్ తగ్గుముఖం పట్టింది. కానీ మూడో వేవ్ ముప్పు మళ్ళీ ప్రారంభమవుతోంది. మూడో వేవ్ పిల్లలకు ప్రాణాంతకమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే పెద్దలు సరైన సమయంలో రోగ నిర్ధారణ, చికిత్సను ప్రారంభించాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల MIS-C తో సహా తీవ్రమైన పరిస్థితుల ప్రభావం నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు. అందువల్ల, తల్లిదండ్రులు పిల్లలను సాధ్యమైనంతవరకు ప్రమాదకర వాతావరణం నుంచి రక్షించడమే కాకుండా ప్రారంభ లక్షణాలపై నిఘా ఉంచాలి.
కొన్నిసార్లు పిల్లలు గొంతునిప్పి, దగ్గు కలిగి ఉండొచ్చు. COVID-19 కారణంగా తీవ్రదగ్గు, గొంతు నొప్పి, ఎగువ శ్వాసకోశ వాపు ఉంటాయి. ముక్కు కారటం మరొక లక్షణం. చాలా మంది పిల్లలు వాసన కోల్పోతారు. ఈ లక్షణాలు కొన్నిసార్లు సాధారణ జలుబు, ఫ్లూతో కలిపి తల్లిదండ్రులను గందరగోళానికి గురిచేస్తాయి. అయినప్పటికీ అలసట, కండరాల నొప్పి, చర్మంపై దద్దుర్లు, ఎర్రటి కళ్ళు, విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం, చలి వంటి లక్షణాలు కనిపిస్తాయి.
భారతదేశం 3.01 కోట్ల కోవిడ్ -19 కేసులను ఎదుర్కొంది. వాటిలో 2.91 కోట్లు రికవరీ అయ్యాయి. ఈ డేటా మొదటి, రెండవ వేవ్‌లకు సంబంధించినది. అదే సమయంలో మరణాల నిష్పత్తి 3.93 లక్షలుగా నమోదైంది. అలాగే ప్రతిరోజూ లక్షలాది మందికి టీకాలు వేస్తున్నారు. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పుడు మూడో వేవ్ కు సిద్ధమవుతున్నాయి. కోవిడ్ -19 ప్రజలను చంపడమే కాదు ఆర్థిక వ్యవస్థపై కూడా భారీ ప్రభావాన్ని చూపింది. కోవిడ్ మన జీవితపు రూపురేఖలను మార్చింది. అయితే ఇప్పుడు కరోనా కేసులలో క్రమంగా తగ్గుదల ఉంది కానీ ఈ కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. పెద్ద సంఖ్యలో ప్రజలు మరణించినట్లు తెలుస్తోంది.