AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాక్‌ దుష్ట పన్నాగాలు.. కరోనా రోగుల్ని అస్త్రాలుగా మార్చి…

ఓ వైపు ప్రపంచ వ్యాప్తంగా దేశాలన్నీ కరోనాతో ఇబ్బందులు పడుతుంటే.. పొరుగు దేశం పాక్‌ మాత్రం తన వక్రబుద్దిని మరోసారి బయటపెట్టుకుంటుంది. నిత్యం మన భారతదేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులను ఎగదోసే ప్రయత్నం చేసే విషయం తెలిసిందే. అయితే తాజాగా పాక్‌లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ అవుతున్నాయి. అయితే ఈ కరోనా రోగుల్ని కొందర్ని అస్త్రాలుగా మార్చి.. మన దేశంలోకి చొప్పించే ప్రయత్నాలు చేస్తోందని తెలిసింది. జమ్ముకశ్మీర్‌ మీదుగా దేశంలోకి పంపేందుకు వ్యూహాలను రచిస్తున్నట్లు నిఘా […]

పాక్‌ దుష్ట పన్నాగాలు.. కరోనా రోగుల్ని అస్త్రాలుగా మార్చి...
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 22, 2020 | 7:10 PM

Share

ఓ వైపు ప్రపంచ వ్యాప్తంగా దేశాలన్నీ కరోనాతో ఇబ్బందులు పడుతుంటే.. పొరుగు దేశం పాక్‌ మాత్రం తన వక్రబుద్దిని మరోసారి బయటపెట్టుకుంటుంది. నిత్యం మన భారతదేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులను ఎగదోసే ప్రయత్నం చేసే విషయం తెలిసిందే. అయితే తాజాగా పాక్‌లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ అవుతున్నాయి. అయితే ఈ కరోనా రోగుల్ని కొందర్ని అస్త్రాలుగా మార్చి.. మన దేశంలోకి చొప్పించే ప్రయత్నాలు చేస్తోందని తెలిసింది. జమ్ముకశ్మీర్‌ మీదుగా దేశంలోకి పంపేందుకు వ్యూహాలను రచిస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు.. దీనికి సంబంధించిన విషయాన్ని జమ్మూకశ్మీర్ పోలీస్ చీఫ్ డిల్బాగ్‌ సింగ్‌ కూడా తెలిపారు.

ఇప్పటివరకు పాక్‌ ఉగ్రవాదులను ఆయుధంగా చేసుకోవడమే మనకు తెలుసని.. ఇప్పుడు కరోనా పాజిటివ్ ఉన్న రోగుల్ని కూడా ఆయుధంగా మార్చి.. దేశంలోకి చొప్పించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. పాక్ కుట్రల్ని ఎప్పటికప్పటికి తిప్పికొడుతున్నామని.. అయినప్పటికీ ఇది ఆందోళన కలిగించే విషయమన్నారు.

Follow Us