క‌రోనా డేంజ‌ర్‌బెల్స్ః ఈశాన్య రాష్ట్రాల్లో తొలి మరణం

క‌రోనా డేంజ‌ర్‌బెల్స్ః ఈశాన్య రాష్ట్రాల్లో తొలి మరణం

దేశంలో క‌రోనా వైర‌స్ డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది. వైర‌స్ వ్యాప్తిని నివారించేందుకు కేంద్రం లాక్‌డౌన్ ప్ర‌క‌టించిది. అయిన‌ప్ప‌టికీ కోవిడ్ భూతం ప్ర‌తాపం చూపిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల‌కు విస్తిర‌స్తూ అత‌లాకుత‌లం చేస్తోంది. గురువారం ఒక్క రోజే దేశంలో 781 పాజిటివ్ కేసులు న‌మోదుకావ‌డం గ‌మ‌నార్హం. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన కేసుల్లో ఇదే గ‌రిష్టం. క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ప్ర‌క‌టించిన లాక్‌డౌన్ ఈ నెల 14తో ముగుస్తుంది. మ‌రోవైపు కొన్ని రాష్ట్రాల్లో మాత్రం వైర‌స్ విజృంభిస్తోంది. […]

Jyothi Gadda

|

Apr 10, 2020 | 10:49 AM

దేశంలో క‌రోనా వైర‌స్ డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది. వైర‌స్ వ్యాప్తిని నివారించేందుకు కేంద్రం లాక్‌డౌన్ ప్ర‌క‌టించిది. అయిన‌ప్ప‌టికీ కోవిడ్ భూతం ప్ర‌తాపం చూపిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల‌కు విస్తిర‌స్తూ అత‌లాకుత‌లం చేస్తోంది. గురువారం ఒక్క రోజే దేశంలో 781 పాజిటివ్ కేసులు న‌మోదుకావ‌డం గ‌మ‌నార్హం. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన కేసుల్లో ఇదే గ‌రిష్టం.
క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ప్ర‌క‌టించిన లాక్‌డౌన్ ఈ నెల 14తో ముగుస్తుంది. మ‌రోవైపు కొన్ని రాష్ట్రాల్లో మాత్రం వైర‌స్ విజృంభిస్తోంది. మ‌హారాష్ట్ర‌లో ప‌రిస్థితి తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 229 కాగా, మ‌ర‌ణాల సంఖ్య 100కు చేరింది. అటు అస్సోంలో క‌రోనా తొలి మ‌ర‌ణం న‌మోదైంది. అసోం ఘటనతో ఈశాన్య రాష్ట్రాల్లో మొట్టమొదటి కరోనా మృతి నమోదవడం గమనార్హం.
అస్సోంలో కోవిడ్‌-19 క‌ల్లోలం రేపుతోంది. హైలాకంది జిల్లాలో 65 ఏళ్ల వ్య‌క్తి వైర‌స్ కార‌ణంగా మృత్యువాత ప‌డ్డాడు. గ‌త కొద్ది రోజుల క్రితం వైర‌స్ పాజ‌టివ్‌గా తేలిన వ్య‌క్తి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించాడు. ఈ మేర‌కు అస్సోం సీఎం బిశ్వ‌శ‌ర్మ అధికారికంగా వెల్ల‌డించారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వివరాల ప్రకారం అసోంలో ఇప్పటివరకు 28 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో ఎక్కువ మంది ఢిల్లీ నిజాముద్దీన్‌లో మర్కజ్ జమాత్‌కు హాజరైనవారే. అసోం నుంచి 617 మంది జ‌మాత్‌కు హాజరైనట్లు ఆరోగ్య శాఖ అంచనా వేసింది. లాక్‌డౌన్ ముగిసిన త‌ర్వాత కూడా కరోనా వ్యాప్తి నివారణ చర్యలు కొనసాగుతాయని సీఎం హిమంత బిశ్వశర్మ ప్రకటించారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu