తీరు మార్చుకోని పాకిస్థాన్.. వైద్యులపై లాఠీఛార్జ్ చేయించిన ప్రభుత్వం..

Coronavirus Updates: ప్రస్తుతం యావత్ ప్రపంచం కనిపించని శత్రువుతో భీకర యుద్ధం చేస్తోంది. అదే కరోనా వైరస్ మహమ్మారి. ఈ వైరస్ నుంచి బయటపడేందుకు ప్రపంచదేశాలన్నీ కూడా తగిన చర్యలు చేపడుతున్నాయి. ఈ తరుణంలో వైద్యులు తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి కరోనా రోగులకు రాత్రింబవళ్ళు చికిత్సను అందిస్తున్నారు. అలాంటివారి సేవలను అభినందించడం అటుంచి.. వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేయడమే కాకుండా అనంతరం అరెస్ట్ చేసి తీసుకెళ్లడం పెద్ద దుమారానికి దారి తీసింది. దీనితో సర్వత్రా […]

తీరు మార్చుకోని పాకిస్థాన్.. వైద్యులపై లాఠీఛార్జ్ చేయించిన ప్రభుత్వం..
Follow us

|

Updated on: Apr 10, 2020 | 2:41 PM

Coronavirus Updates: ప్రస్తుతం యావత్ ప్రపంచం కనిపించని శత్రువుతో భీకర యుద్ధం చేస్తోంది. అదే కరోనా వైరస్ మహమ్మారి. ఈ వైరస్ నుంచి బయటపడేందుకు ప్రపంచదేశాలన్నీ కూడా తగిన చర్యలు చేపడుతున్నాయి. ఈ తరుణంలో వైద్యులు తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి కరోనా రోగులకు రాత్రింబవళ్ళు చికిత్సను అందిస్తున్నారు. అలాంటివారి సేవలను అభినందించడం అటుంచి.. వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేయడమే కాకుండా అనంతరం అరెస్ట్ చేసి తీసుకెళ్లడం పెద్ద దుమారానికి దారి తీసింది. దీనితో సర్వత్రా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇక ఈ ఘటన పాకిస్తాన్‌లోని బలోచిస్తాన్ ప్రాంతంలోని క్వెట్టాలో చోటు చేసుకుంది.

పాకిస్తాన్‌లోని క్వెట్టాలో కరోనా కట్టడికి ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు. అయితే కరోనా పేషంట్లకు చికిత్స అందిస్తున్న డాక్టర్లకు పరికరాల కొరత ఏర్పడింది. వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ) కిట్లు, మాస్కులు, చేతి గ్లౌజులు వంటివి అందుబాటులో లేవు. ఈ పీపీఈ కిట్లను అందించాలని వైద్యులు కొన్ని వారాలుగా ప్రభుత్వాన్ని కోరుతున్నా, సరిగ్గా స్పందించకపోవడంతో ఆసుపత్రి ఎదుట వైద్యులు ఆందోళనకు దిగారు. దానితో పోలీసులు రంగంలోకి దిగి వారిపై లాఠీచార్జ్ చేసి.. 53 మంది వైద్యులను అరెస్ట్ చేశారు.

ఇక ఈ విషయం బలోచిస్తాన్ దృష్టి వెళ్ళింది. పీపీఈల కొరత ఉన్న సంగతి వాస్తవమేనని.. దానికి తగిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నామని చెప్పింది. అయితే వైద్యులు తమ సహనం కోల్పోయి 144 సెక్షన్‌ను ఉల్లంఘించి ఇలా నిరసన చేపట్టడం సరికాదని తెలిపింది. ఈ క్రమంలోనే వారిని అరెస్ట్ చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది. కాగా, పాకిస్తాన్‌లో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు 4,601 కేసులు నమోదు కాగా.. 66 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు.

ఇవి చదవండి:

జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఓలా సర్వీసులకు గ్రీన్ సిగ్నల్..

సీఎం సంచలనం.. డాక్టర్లు, నర్సులకు డబుల్ శాలరీ..

ఏపీలో కరోనా రోగులకు పౌష్టికాహారం.. ఆరోగ్య ఆంధ్రా ట్వీట్ వైరల్..

దేశంలో పెరుగుతోన్న కరోనా కేసులు.. మొదటి స్థానం, చివరి స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఇవే..

జూలైలో ఐపీఎల్.. కొత్త తేదీలు ఫిక్స్.?

కేంద్రం ప్రకటన.. ఏప్రిల్ 14 జాతీయ సెలవు దినం..

ఏపీ తాజా హెల్త్ బులిటెన్.. తగ్గుతోన్న కరోనా కేసులు..

కేంద్రం కీలక నిర్ణయం.. పెరగనున్న అబార్షన్ల సంఖ్య.!

ఏప్రిల్ 15 నుంచి రైల్ జర్నీ.. కండీషన్స్ అప్లై..!