AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీఎం కేసీఆర్ స్పెష‌ల్ గిఫ్ట్‌..వారి ఖాతాల్లోకి రూ.5వేలు

మ‌హ‌మ్మారి కోవిడ్-19 పంజా నుంచి త‌ప్పించుకోవ‌టానికి ప్ర‌జ‌లు గ‌డ‌ప‌దాట‌కుండా జాగ్ర‌త్త‌చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. కానీ, వాళ్లు మాత్రం నిరంత‌రం శ్ర‌మిస్తున్నారు...

సీఎం కేసీఆర్ స్పెష‌ల్ గిఫ్ట్‌..వారి ఖాతాల్లోకి రూ.5వేలు
Jyothi Gadda
|

Updated on: Apr 10, 2020 | 11:29 AM

Share
క‌రోనా దెబ్బ‌కు యావ‌త్ భార‌తావ‌ని బంధిగా మారింది. కేంద్రం ప్ర‌క‌టించిన లాక్‌డౌన్ తో ప్ర‌జ‌లు ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. రోడ్లు, వీధులు నిర్మానుష్యంగా మారాయి. మ‌హ‌మ్మారి కోవిడ్-19 పంజా నుంచి త‌ప్పించుకోవ‌టానికి ప్ర‌జ‌లు గ‌డ‌ప‌దాట‌కుండా జాగ్ర‌త్త‌చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. కానీ, వాళ్లు మాత్రం నిరంత‌రం శ్ర‌మిస్తున్నారు. వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను ప‌క‌డ్బందీగా అమ‌లు చేస్తున్నారు. అటువంటి క‌ష్ట‌జీవుల‌కు సీఎం కేసీఆర్ స్పెష‌ల్ గిఫ్ట్ ప్ర‌క‌టించారు.
లాక్‌డౌన్ కాలంలో రోడ్ల‌ను ఊడుస్తూ వీధులు, గ‌ల్లీల‌ను శుభ్రం చేస్తూ..ఎప్ప‌టిక‌ప్పుడు బ్లీచింగ్ పౌడ‌ర్ చ‌ల్లుతూ క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా చూస్తున్న శానిటైజ‌ర్ సిబ్బందికి సీఎం బ‌హుమ‌తి అంద‌జేయ‌నున్నారు. వారి కష్టాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ వారికి ప్రోత్సాహకం అందిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. వారికి చేతులెత్తి దండం పెట్టిన సీఎం.. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌డబ్ల్యూలో పనిచేస్తున్న వారికి రూ.7500, గ్రామపంచాయతీలు, మునిసిపాలిటీల్లో పనిచేస్తున్న వారికి రూ.5వేలు ఇస్తానని చెప్పారు. అన్నట్లుగానే సీఎం స్పెషల్ ఇన్సెంటివ్ నిధులు విడుదలయ్యాయి. ప్రతి కార్మికుడి ఖాతాల్లోకి నేటి నుంచి రూ.5వేలు జమకానున్నాయి. దాని కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.21.84 కోట్లు విడుదల చేసింది.
గ్రామ పంచాయతీల్లో సఫాయి కర్మచారులు 43,661 మంది, మునిసిపాలిటీల్లో 21,531మంది, హైదరాబాద్‌ వాటర్‌వర్క్స్‌ అండ్‌ సేవరేజ్‌ బోర్డులో 2510, జీహెచ్‌ఎంసీలో 20690 మంది.. మొత్తం 95,392 మంది పనిచేస్తున్నారు. వారందరికీ సీఎం గిఫ్ట్ అందనుంది. వారి జీతాల్లోనూ కోత పెట్టకుండా చర్యలు తీసుకున్నారు సీఎం.దీంతో కార్మికులు త‌మ క‌ష్టాన్ని గుర్తించిన సీఎంకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Follow Us
అదృష్టం మారబోతుంది.. కృష్ణాష్టమి రోజే మహాయోగంతో వీరికి లాభాలే
అదృష్టం మారబోతుంది.. కృష్ణాష్టమి రోజే మహాయోగంతో వీరికి లాభాలే
యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారా..? ఆగిపోనున్న సేవలు.. ఎప్పుడంటే..?
యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారా..? ఆగిపోనున్న సేవలు.. ఎప్పుడంటే..?
హైదరాబాద్ బిర్యానీ తింటున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే...
హైదరాబాద్ బిర్యానీ తింటున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే...
రాగి ఇడ్లీ సాఫ్ట్‌గా రావాలంటే పిండి ఇలా కలపండి..
రాగి ఇడ్లీ సాఫ్ట్‌గా రావాలంటే పిండి ఇలా కలపండి..
బంగారం ధరల్లో భారీ మార్పు.. గంటల వ్యవధిలోనే ఊహించని ట్విస్ట్
బంగారం ధరల్లో భారీ మార్పు.. గంటల వ్యవధిలోనే ఊహించని ట్విస్ట్
చిన్ని కృష్ణుడి ఫేవరెట్.. బలాన్నిచ్చే మ్యాజిక్ లడ్డు..
చిన్ని కృష్ణుడి ఫేవరెట్.. బలాన్నిచ్చే మ్యాజిక్ లడ్డు..
జన్మాష్టమి.. మీ ఇంటి చిన్నకన్నయ్యను.. ఇలా అందంగా రెడీ చేయండి
జన్మాష్టమి.. మీ ఇంటి చిన్నకన్నయ్యను.. ఇలా అందంగా రెడీ చేయండి
రాత్రికి రాత్రే రూ. 36 కోట్లకు అధిపతిగా కామన్ మ్యాన్!
రాత్రికి రాత్రే రూ. 36 కోట్లకు అధిపతిగా కామన్ మ్యాన్!
పదేళ్లు పూర్తి చేసుకోబోతున్న జియో.. టెలికాం రంగంలో మార్పులివే..
పదేళ్లు పూర్తి చేసుకోబోతున్న జియో.. టెలికాం రంగంలో మార్పులివే..
ఆ బ్లాస్ట్ లో కృష్ణ అయిపోయారు.. బ్రతకడం కష్టం అన్నారు..
ఆ బ్లాస్ట్ లో కృష్ణ అయిపోయారు.. బ్రతకడం కష్టం అన్నారు..