తిరిగి ప్రారంభమైన లోకల్‌ ట్రైన్లు.. వారికి మాత్రమే అనుమతి

లోకల్ రైలు ప్రయాణాలకు పెట్టింది పేరు ముంబయి. లాక్‌డౌన్‌తో గత రెండు నేలలుగా మూతపడిన లోకల్ ట్రైన్స్‌ సోమవారం నుంచి పున: ప్రారంభమయ్యాయి. అయితే ప్రస్తుతం కొంతమందికి మాత్రమే అనుమతిని ఇస్తున్నట్లు ముంబయి లోకల్ ట్రైన్ అధికారులు పేర్కొన్నారు. అత్యవసర సేవల సిబ్బంది, వైద్య రంగంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో...

తిరిగి ప్రారంభమైన లోకల్‌ ట్రైన్లు.. వారికి మాత్రమే అనుమతి
Follow us

| Edited By:

Updated on: Jun 15, 2020 | 7:53 AM

లోకల్ రైలు ప్రయాణాలకు పెట్టింది పేరు ముంబయి. లాక్‌డౌన్‌తో గత రెండు నేలలుగా మూతపడిన లోకల్ ట్రైన్స్‌ సోమవారం నుంచి పున: ప్రారంభమయ్యాయి. అయితే ప్రస్తుతం కొంతమందికి మాత్రమే అనుమతిని ఇస్తున్నట్లు ముంబయి లోకల్ ట్రైన్ అధికారులు పేర్కొన్నారు. అత్యవసర సేవల సిబ్బంది, వైద్య రంగంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్న వారు మాత్రమే ఈ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు. లోకల్ రైళ్లను తీసుకొచ్చే అంశమై సమాశమైన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

కాగా అత్యవసర సేవల సిబ్బంది కూడా లోకల్ ట్రైన్స్‌లో ప్రయాణించాలంటే గుర్తింపు కార్డు తప్పనిసరి చేశారు అధికారులు. స్టేషన్‌లోకి వెళ్లేందుకు, టికెట్ కొనేటప్పుడు ఈ ఐడెంటిటీ కార్డుని చూపించవలసి ఉంటుంది. అనంతరం ఈ పాస్ లేదా క్యూ ఆర్ వస్తుంది. దీని ఆధారంగా రైల్వే స్టేషన్‌కి అనుమతిస్తారు. భౌతిక దూరం పాటించేందుకు వీలుగా ఒక లోకల్ ట్రైన్‌లో కేవలం 700 మంది పాసింజర్స్‌కి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు.

Read More: 

ప్రపంచవ్యాప్తంగా 80 లక్షలకు చేరువలో కరోనా కేసులు..

కరోనా వ్యాప్తిపై సమీక్ష.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

కర్ణాటకకు బస్సులు నడిపేందుకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్…

వాళ్లెవరూ అసెంబ్లీకి రావడానికి వీల్లేదు.. ప్రత్యేక గైడ్‌లైన్స్ ఇవే..