ఆన్‌లైన్‌లో లిక్కర్ ఆర్డర్ చేస్తే ఏం జరిగిందో తెలుసా…
లాక్‌డౌన్ సమయాన్ని సరిగ్గా వినియోగించుకుంటున్నారు ఆన్‌లైన్ మోసగాళ్లు. మీ ఇంటికే అన్నింటిని పూలల్లో పెట్టి తెచ్చిస్తామంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు గుప్పిస్తున్నారు. అవసరం ఎంతకైన పడేస్తుందనే సామెతను వీరు క్యాష్ చేసుకుంటున్నారు. గత కొద్ది రోజుల క్రితం జరిగిన ఓ ఆన్‌లైన్ మోసం మహారాష్ట్రలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముంబైలోని చందివిల్లి రహెజా విహార్‌కు చెందిన ఓ బ్యాంక్ ఉద్యోగి ఆన్‌లైన్‌లో లిక్కర్ ఆర్డర్ చేయాలనుకున్నాడు. వెంటనే ఇంటర్‌నెట్ లో సెర్చ్ చేసి… ఫేస్‌బుక్‌లో దొరికిన ఓ […]

లాక్‌డౌన్ సమయాన్ని సరిగ్గా వినియోగించుకుంటున్నారు ఆన్‌లైన్ మోసగాళ్లు. మీ ఇంటికే అన్నింటిని పూలల్లో పెట్టి తెచ్చిస్తామంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు గుప్పిస్తున్నారు. అవసరం ఎంతకైన పడేస్తుందనే సామెతను వీరు క్యాష్ చేసుకుంటున్నారు.
గత కొద్ది రోజుల క్రితం జరిగిన ఓ ఆన్‌లైన్ మోసం మహారాష్ట్రలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముంబైలోని చందివిల్లి రహెజా విహార్‌కు చెందిన ఓ బ్యాంక్ ఉద్యోగి ఆన్‌లైన్‌లో లిక్కర్ ఆర్డర్ చేయాలనుకున్నాడు. వెంటనే ఇంటర్‌నెట్ లో సెర్చ్ చేసి… ఫేస్‌బుక్‌లో దొరికిన ఓ నెంబర్‌కు కాల్ చేశాడు. తాను అడిగిన బ్రాండ్ ఉందని చెప్పటంతో ఇంకేముంది ఆర్డర్ చేశాడు. ఆన్‌లైన్ పేమెంట్‌కు ఒప్పుకున్నాడు. వారు అడిగిన క్రెడిట్ కార్డు వివరాలను అందించాడు. చెల్లింపులు ముగిశాయి. మద్యం డెలివరీ చేయవల్సి ఉంది.
అయితే గంటలు గడుస్తున్నా మద్యం డోర్ డెలివరీ అవ్వలేదు. దీంతో అనుమానం వచ్చి చూసుకుంటే తన ఎకౌంట్ నుంచి దాదాపు 82,500 రూపాయలు క్రెడిట్ అయినట్లుగా గుర్తించాడు. వెంటనే బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. తనకు జరిగిన మోసంను వారికి వివరించాడు. వారు కార్డును బ్లాక్ చేశారు. అయితే అప్పటికే పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారటంతో చేసేదిలేక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
