AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాక్‌డౌన్: ప్రైవేటు స్కూళ్లలో 50 శాతం ఫీజు కడితే చాలట

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. అలాగే మన దేశంలోనూ కరోనా తీవ్రంగా వ్యాపిస్తూండటంతో నిత్యావసరాలు మినహా మిగతా కార్యకలాపాలన్నీ మూసివేశారు. ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాల నుంచి అన్ని పరిశ్రమలూ మూతపడ్డాయి. కాగా ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలతో గ్రీన్, ఆరెంజ్‌ జోన్లలో పలు షాపులు తెరవడానికి సడలింపులు ఇచ్చింది. అయితే ఇన్ని రోజులూ లాక్‌డౌన్ కారణంగా ప్రజలు పలు ఆర్థిక […]

లాక్‌డౌన్: ప్రైవేటు స్కూళ్లలో 50 శాతం ఫీజు కడితే చాలట
TV9 Telugu Digital Desk
|

Updated on: May 07, 2020 | 4:16 PM

Share

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. అలాగే మన దేశంలోనూ కరోనా తీవ్రంగా వ్యాపిస్తూండటంతో నిత్యావసరాలు మినహా మిగతా కార్యకలాపాలన్నీ మూసివేశారు. ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాల నుంచి అన్ని పరిశ్రమలూ మూతపడ్డాయి. కాగా ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలతో గ్రీన్, ఆరెంజ్‌ జోన్లలో పలు షాపులు తెరవడానికి సడలింపులు ఇచ్చింది. అయితే ఇన్ని రోజులూ లాక్‌డౌన్ కారణంగా ప్రజలు పలు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి వస్తోంది. దీంతో ప్రస్తుత పరిస్థితుల దష్ట్యా మిజోరంలో ప్రైవేట్ స్కూళ్లు కేవలం 50 శాతం మాత్రమే ఫీజులను వసూలు చేయాలని ఆదేశించింది అక్కడి ప్రభుత్వం.

విద్యార్థుల నుంచి కేవలం 50 శాతం ఫీజు చెల్లించాలని ప్రైవేటు స్కూల్స్‌ని ఆదేశించినట్టు ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. తాజాగా స్కూళ్లు, కాలేజీల ఫీజులపై విద్యాశాఖ అధికారులు సమావేశాన్ని నిర్వహించాయి. ఈ సమావేశంలో ఫీజుల చెల్లింపులపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు అధికారులు. లాక్‌డౌన్ సమయంలో విద్యార్థులు స్కూల్ ఫీజులు చెల్లించలేని పరిస్థితి ఉందని, ఫీజుల విషయంలో ఇప్పటికే విద్యార్థి విభాగాలు అభ్యర్థించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.

అలాగే అన్ని ప్రైవేటు, మిషన్ స్కూళ్లు నడిపిస్తున్న చర్చీల్లో కూడా పేద విద్యార్థులకు ఫీజుల నుంచి మినహాయింపు ఇవ్వాలని సూచించినట్టు చెప్పారు. ఏప్రిల్ నెలలో మొత్తం ఫీజును వసూలు చేసిన స్కూళ్లన్నీ.. మే నెలలో విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయరాదని స్కూల్ యాజమాన్యాలను ఆదేశించినట్టు మిజోరాం ప్రభుత్వం పేర్కొంది.

Read More: బ్రేకింగ్: మృతుల కుటుంబాలకి రూ. కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన జగన్

Follow Us
శ్రేయస్ అయ్యర్‌ మీద వైభవ్‎కు అంత కోపముందా ?
శ్రేయస్ అయ్యర్‌ మీద వైభవ్‎కు అంత కోపముందా ?
టీ vs కాఫీ.. ఇదో పెద్ద మైండ్ గేమ్.. మీ ఛాయిస్‌ను బట్టి మీరు ఎలాంట
టీ vs కాఫీ.. ఇదో పెద్ద మైండ్ గేమ్.. మీ ఛాయిస్‌ను బట్టి మీరు ఎలాంట
మ్రాబాద్‌లో రికార్డు స్థాయిలో పులుల గుర్తింపు.. అడ పులులదే రాజ్యం
మ్రాబాద్‌లో రికార్డు స్థాయిలో పులుల గుర్తింపు.. అడ పులులదే రాజ్యం
నువ్వు లేకపోతే చచ్చిపోతా అని.. తర్వాత టార్చర్ చేశాడు..
నువ్వు లేకపోతే చచ్చిపోతా అని.. తర్వాత టార్చర్ చేశాడు..
బలవంతులమని విర్రవీగితే మనకంటే సమర్థులు ఎదురుపడతారు.. తెలివిగా ఇలా
బలవంతులమని విర్రవీగితే మనకంటే సమర్థులు ఎదురుపడతారు.. తెలివిగా ఇలా
టికెట్ ఉన్నా ఈ రైల్వే స్టేషన్‌లోకి అడుగుపెట్టలేరు.. ఎందుకంటే?
టికెట్ ఉన్నా ఈ రైల్వే స్టేషన్‌లోకి అడుగుపెట్టలేరు.. ఎందుకంటే?
జుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ రూ.199కే..వ్యాలిడిటీ ఎంతంటే
జుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ రూ.199కే..వ్యాలిడిటీ ఎంతంటే
మరో చరిత్ర సృష్టించిన ఐర్లాండ్ టీం.. షాక్‎లో క్రికెట్ అభిమానులు
మరో చరిత్ర సృష్టించిన ఐర్లాండ్ టీం.. షాక్‎లో క్రికెట్ అభిమానులు
అమ్మాయిలను రూమ్‌కి రప్పించి.. ఆ తర్వాత వేరే కథ
అమ్మాయిలను రూమ్‌కి రప్పించి.. ఆ తర్వాత వేరే కథ
తెలంగాణలో వీఐపీల సెక్యూరిటీపై ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం..
తెలంగాణలో వీఐపీల సెక్యూరిటీపై ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం..