ఓటీటీల్లో నటించేందుకు మెగాస్టార్ సిద్ధంః అల్లు అరవింద్
కరోనాతో స్తంభించిన చిత్ర పరిశ్రమ.. వచ్చే రెండు, మూడు నెలల్లో తిరిగి మొదలయ్యే అవకాశం ఉందని టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ పేర్కొన్నారు. అలాగే ఈ ఏడాది మాత్రం టాప్ హీరోల సినిమాలు విడుదల కావని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ వచ్చిన తర్వాతే థియేటర్లకు ప్రేక్షకులు..
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావంతో సినీ ఇండస్ట్రీ మొత్తం స్తంభించిపోయిన విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి కారణంగా ఇప్పటికే థియేటర్స్ ఓపెన్ కాలేదు. దీంతో ఎన్నో సినిమాల విడుదలలు ఆగిపోయాయి. స్టార్ హీరోల సినిమాలు తప్పించి.. చాలా సినిమాలు ఇప్పటికే ఓటీటీల్లో రిలీజ్ అవుతున్నాయి. అయితే కరోనాతో స్తంభించిన చిత్ర పరిశ్రమ.. వచ్చే రెండు, మూడు నెలల్లో తిరిగి మొదలయ్యే అవకాశం ఉందని టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ పేర్కొన్నారు. అలాగే ఈ ఏడాది మాత్రం టాప్ హీరోల సినిమాలు విడుదల కావని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ వచ్చిన తర్వాతే థియేటర్లకు ప్రేక్షకులు వస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు అరవింద్.
కాగా ఆహా ఓటీటీ యాప్‌లో ఆగష్టు బ్లాక్ బస్టర్ నడుస్తున్న క్రమంలో వాటి గురించి అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఇందులో విడుదలయ్యే సినిమాల వివరాలను వెల్లడించారు. ఆహా యాప్‌లో ప్రేక్షుకుల నుంచి ఆదరణ పెరిగిందని, పెద్ద హీరోలు కూడా ఓటీటీల్లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నారని ఆయన అన్నారు. మెగాస్టార్ చిరంజీవితో కూడా ఆహా కోసం సంప్రదింపులు జరిపినట్లు ఆయన చెప్పారు. కథ నచ్చితే ఓటీటీలోనూ మెగాస్టార్ నటించేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు అల్లు అరవింద్. ఈ లెక్కన చూస్తే ఆహాలో మెగాస్టర్ చిరంజీవి కనిపించడం ఖాయం అనిపిస్తుంది.
Read More:
ఈ నెల 19న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం
ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ఇంకా అలాగే ఉందిః ఆర్మీ ఆస్పత్రి వైద్యులు