AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోజికోడ్ రెస్క్యూ టీంలో 22 మందికి కరోనా

పుణ్యం చేయబోతే పాపం ఎదురైనట్లు అపదలో ఉన్న వారిని ఆదుకున్న వారికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు.

కోజికోడ్ రెస్క్యూ టీంలో 22 మందికి కరోనా
Balaraju Goud
|

Updated on: Aug 14, 2020 | 4:32 PM

Share

పుణ్యం చేయబోతే పాపం ఎదురైనట్లు అపదలో ఉన్న వారిని ఆదుకున్న వారికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. గ‌త వారం కేర‌ళ‌లోని కోజికోడ్ విమానాశ్ర‌యంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 18 మంది ప్ర‌యాణికులు మృతి చెందగా చాలా వరకు గాయాలపాలయ్యారు. విమానం కూడా రెండు ముక్క‌లైంది. అయితే, విమాన ప్ర‌మాదంలో చిక్కుకున్నవారిని రెస్క్యూ ఆప‌రేష‌న్‌ టీం సహాయకచర్యలు చేపట్టింది. అనేక మంది అధికారులు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు.

ఇదిలావుంటే, ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం కారంణంగా సహాయకచర్యల్లో పాల్గొన్న అధికారుల‌కు కొవిడ్ టెస్టులు నిర్వహించారు. వీరిలో 22 మందికి క‌రోనా వైర‌స్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. అధికారుల జాబితాలో జిల్లా క‌లెక్ట‌ర్‌తో పాటు లో స్థానిక పోలీసు అధికారి కూడా ఉన్న‌ట్లు మాల‌ప్పురం మెడిక‌ల్ ఆఫీస‌ర్ తెలిపారు. వందేభార‌త్ మిష‌న్‌లో భాగంగా 184 మంది ప్ర‌యాణికుల‌తో దుబాయ్ నుంచి వ‌చ్చిన విమానం.. క‌రిపుర్ విమానాశ్ర‌యంలో ల్యాండింగ్ స‌మ‌యంలో కుప్పకూలింది. ఇక, రెస్క్యూ ఆప‌రేష‌న్‌లో పాల్గొని క‌రోనా ప‌రీక్ష‌లో పాజిటివ్‌గా తేలిన వారిని క్వారెంటైన్ చేసిన‌ట్లు వైద్యాధికారులు తెలిపారు. ప్రాణాలతో బయటపడినవారిని హోం క్వారంటైన్ చేసినట్లు అధికారులు తెలిపారు.

Follow Us
సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన..
సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన..
రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు..
రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు..
శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా..
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా..
సొర పిట్టు తింటే క్యాన్సర్ రాదా..?
సొర పిట్టు తింటే క్యాన్సర్ రాదా..?
బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతుల యుద్ధం,15 సెకన్లలో 14 చెంపదెబ్బలు
బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతుల యుద్ధం,15 సెకన్లలో 14 చెంపదెబ్బలు
హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్
హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్
టీడీపీ-వైసీపీ మధ్య ‘సెమి ఫైనల్ వార్’ ఇప్పుడే షురూ!
టీడీపీ-వైసీపీ మధ్య ‘సెమి ఫైనల్ వార్’ ఇప్పుడే షురూ!
ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!
ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!
మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి..అదృష్టం,ధనయోగం మీ చెంత ఉన్నట్టే
మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి..అదృష్టం,ధనయోగం మీ చెంత ఉన్నట్టే