మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కేసులు నమోదు
కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో రోజు నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా..

కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో రోజు నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏకంగా 11,147 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,11,798కి చేరింది. ఇక వీటిలో కరోనా నుంచి కోలుకుని 2,48,615 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,48,150 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి గడిచిన 24 గంటల్లో 266 మంది మరణించారు.
Maharashtra reports 266 deaths and 11,147 new #COVID19 cases today. The total number of cases is now 4,11,798 including 2,48,615 recovered cases and 1,48,150 active cases: State Health Department pic.twitter.com/EgmojRKGCZ
— ANI (@ANI) July 30, 2020
Read More
భవనంలో భారీ పేలుడు.. 16 మందికి గాయాలు



