భక్తులకు శుభవార్త: శ్రీవారి దర్శనం టికెట్ల కాలపరిమితి పెంపు
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత్ లో రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో శ్రీవాణి ట్రస్టు దర్శనం టికెట్ల కాలపరిమితిని పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా

Srivani trust Darshan tickets: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత్ లో రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో శ్రీవాణి ట్రస్టు దర్శనం టికెట్ల కాలపరిమితిని పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో భక్తుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. శుక్రవారం నుండి శ్రీవాణి ట్రస్టు ద్వారా రూ. 10 వేలు చెల్లించి టికెట్లు పొందిన భక్తుల దర్శన కాలాన్ని ప్రస్తుతం ఉన్న 6 నెలల కాల పరిమితిని ఏడాదికి పెంచడమైంది. ఇదివరకే ఆన్‌లైన్‌లో శ్రీవాణి ట్రస్టు ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు సంవత్సరంలోపు వినియోగించుకోవలసి ఉంటుంది.
Read More:
గుడ్ న్యూస్: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 26,778 మెడికల్ పోస్టుల భర్తీ!
జీహెచ్ఎంసీలో మొబైల్ టెస్టింగ్ ల్యాబ్లు.. గంటకు 500 పరీక్షలు..!