“మహా”లో కరోనా ఉగ్రరూపం.. ఒక్కరోజే 3752 కేసులు.. 100 మరణాలు..

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. గురువారం ఒక్కరోజే.. రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. కొత్తగా 3752 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

మహాలో కరోనా ఉగ్రరూపం.. ఒక్కరోజే 3752 కేసులు.. 100 మరణాలు..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 18, 2020 | 9:40 PM

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. గురువారం ఒక్కరోజే.. రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. కొత్తగా 3752 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 1,20,504కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 100 మంది మరణించినట్లు మహారాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడి 5,751 మంది మరణించారని పేర్కొంది. ఇక కరోనా నుంచి కోలుకుని 60,838 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని అధికారులు తెలిపారు.

ఇదిలావుంటే.. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా ముంబై మహానగరం నుంచే నమోదవుతుండటం కలకలం రేపుతోంది. గడిచిన 24 గంటల్లో 1,298 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. అంతేకాదు.. 67 మంది కరోనా బారినపడి మరణించారని తెలిపారు. ఇప్పటి వరకు ముంబైలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 62,799కి చేరింది. మరణాల సంఖ్య కూడా ముంబై నగరంలోనే అత్యధికంగా ఉంది. ఇప్పటి వరకు కరోనా బారినపడి ఇక్కడ 3,309 మంది మరణించారు.