మహారాష్ట్రలో లాక్‌డౌన్ ఉండదు.. రెండు వారాలపాటు 144 ఆంక్షలు.. కీలక ప్రకటన చేసిన సీఎం ఉద్ధవ్‌ఠాక్రే
మహారాష్ట్రలో సంపూర్ణ లాక్‌డౌన్ కాదు కానీ.. అలాంటిదే విధించారు ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే. మహా జనతా కర్ఫ్యూ బుధవారం రాత్రి 8 గంటల నుంచి అమల్లోకి వస్తుందని ఆయన ప్రకటించారు.
No Lockdown in Maharastra: మహారాష్ట్రలో సంపూర్ణ లాక్‌డౌన్ కాదు కానీ.. అలాంటిదే విధించారు ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే. మహా జనతా కర్ఫ్యూ బుధవారం రాత్రి 8 గంటల నుంచి అమల్లోకి వస్తుందని ఆయన ప్రకటించారు. కరోనా మహమ్మారి రాష్ట్రంలో పూర్తిగా అదుపు తప్పిందని, విధి లేని పరిస్థితుల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తునట్టు ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని వెల్లడించారు. కోవిడ్ బాధితులకు చికిత్స అందించడంలో కొంత జాప్యం జరుగుతున్న వార్తలు వాస్తవమేనని ఉద్దవ్ అంగీకరించారు. వైరస్ కారణంగా విలవిలలాడుతున్న మహారాష్ట్రను ఆదుకోవాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు సీఎం ఉద్దవ్.
కరోనా కట్టడి భాగంగా తాజాగా రెండు, మూడు వారాలపాటు లాక్‌డౌన్ విధించాలని భావించిన మహారాష్ట్ర ప్రభుత్వం ఒకడుగు వెనక్కు వేసింది. రాష్ట్రంలో లాక్‌డౌన్ ఉండదని ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే మంగళవారం మీడియాకు చెప్పారు. కానీ ఆ తరహాలో 15 రోజుల పాటు 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. విధి లేని పరిస్థితుల్లో మహారాష్ట్ర వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ విధిస్తునట్టు ప్రకటించారు. సరైన సమయంలో ఆక్సిజన్ అందక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని , కేంద్రానికి పదేపదే విజ్ఞప్తులు చేసినప్పటికి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే ప్రెస్ మీట్ః
Local train and bus services for essential services only, petrol pumps, financial institutions associated with SEBI and construction work to continue, hotel/ restaurants to remain closed only take-away, home deliveries allowed: Maharashtra CM pic.twitter.com/QJkJlX4WTK
— ANI (@ANI) April 13, 2021
ప్రజలు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి 15 రోజుల పాటు బయటకు రావద్దని కోరారు. ప్రభుత్వ ., ప్రైవేట్ కార్యాలయాలను మూసివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే, పెట్రో బంకులు, ఐటీ కంపెనీలు , మెడికల్ షాప్‌లు తెరిచే ఉంటాయని సీఎం ఉద్దవ్ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 ఆంక్షలు అమలులో ఉంటాయని ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. లాక్‌డౌన్ లేకున్నా ఆ తరహాలోనే ఆంక్షలు అమలు చేస్తామని స్పష్టం చేశారు.
బుధవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా మరింత కఠినంగా ఆంక్షలు అమలులోకి వస్తాయని ఉద్ధవ్ ఠాక్రే వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉందన్నారు. దవాఖానల్లో పడకలు, ఆక్సిజన్ కొరత వేధిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్పత్తి చేస్తున్న ఆక్సిజన్ మొత్తం వైద్య అవసరాలకే ఉపయోగించాలని ఉద్ధవ్ ఠాక్రే కీలక ఆదేశాలు జారీ చేశారు. వైద్య సదుపాయాలను క్రమంగా పెంచుతున్నట్లు తెలిపారు.