మధ్యప్రదేశ్ కేబినెట్ మినిస్టర్‌కి కరోనా పాజిటివ్..
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య 11 లక్షలు దాటిపోయాయి. రోజురోజుకీ కోవిడ్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. అటు మరణాల సంఖ్య కూడా పెరిగిపోతుంది. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, పోలీసులు...
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య 11 లక్షలు దాటిపోయాయి. రోజురోజుకీ కోవిడ్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. అటు మరణాల సంఖ్య కూడా పెరిగిపోతుంది. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, పోలీసులు, వైద్య సిబ్బంది, పలువురు ప్రముఖ నటులు కూడా ఈ వైరస్ బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా మరో మంత్రి కూడా ఈ మహమ్మారి బారిన పడ్డారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వ కేబినెట్ మంత్రికి కరోనా సోకింది. నిన్న రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో పాల్గొన్నారు మంత్రి. అలాగే గవర్నర్ లాల్జీ టాండన్ చివరి కర్మ కార్యక్రమానికి కూడా హాజరయ్యారు. దీంతో మంత్రి ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యారో వారికి కూడా టెస్టులు చేస్తున్నారు వైద్యులు. కాగా ప్రస్తుతం మధ్యప్రదేశ్ కేబినెట్ మంత్రి భోపాల్‌లోని ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇక భోపాల్‌లో రేపటి నుంచి 10 రోజుల పాటు లాక్‌డౌన్ విధించనుంది మధ్య ప్రదేశ్ ప్రభుత్వం.
తాజాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా మరో 37,724 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11,92,915కి చేరింది. ఇక ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 4,11,133 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 7,53,050 మంది ఆస్ప్రతుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కరోనా బారినపడి 648 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా బారినపడి 28,732 మంది మరణించారు.