AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సొరచేపతో కత్రినా కైఫ్ జలకాలాటలు

అంతా కుక్కలు, పిల్లులతో ఫ్రెండ్‌షిప్ చేస్తే ఈ అందాల సుందరి మాత్రం తన ఫ్రెండ్‌తో కలిసి సముద్రంలో జలకన్యలా మారిపోయింది. వయ్యారంగా ఈత కొడుతూ ప్రపంచ మహా సముద్రాల దినోత్సవంను తన మిత్రుడితో పంచుకుంది. ఈ వీడియోను తన ఫ్యాన్స్ కోసం షేర్ చేసింది.....

సొరచేపతో కత్రినా కైఫ్ జలకాలాటలు
Sanjay Kasula
|

Updated on: Jun 09, 2020 | 9:52 AM

Share

Katrina Kaif swimming…కోవిడ్ -19తో అంతా ఇంటికే పరమితమైపోయారు. అయితే అన్‌లాక్ 1.0లో జనం ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. పనుల్లో బిజీగా మారకపోయినప్పటికీ.. సరదాగా గడుపుతున్నారు. ఇందులో టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖలు ముందు వరుసలో ఉంటున్నారు. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తన ఫామ్ హౌస్‌‌ను క్లీన్ చేస్తూ కనిపించాడు. ఇక బాలీవుడ్ భామ కత్తి.. కత్రినా కైఫ్ మాత్రం తన చిరకాల మిత్రుడితో క్లోజ్‌గా గడిపింది. మిత్రుడు అంటే ఓ పెద్ద సొరచేప.

అంతా కుక్కలు, పిల్లులతో ఫ్రెండ్‌షిప్ చేస్తే ఈ అందాల సుందరి మాత్రం తన ఫ్రెండ్‌తో కలిసి సముద్రంలో జలకన్యలా మారిపోయింది. వయ్యారంగా ఈత కొడుతూ ప్రపంచ మహా సముద్రాల దినోత్సవంను తన మిత్రుడితో పంచుకుంది. ఈ వీడియోను తన ఫ్యాన్స్ కోసం షేర్ చేసింది. అంతే కాదు ఆ వీడియోకు ‘నా మిత్రుడితో సముద్రంలో ఓ అందమైన రోజు’అంటూ ఓ క్యాప్షన్ కూడా పెట్టింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది.

View this post on Instagram

#tb to A beautiful day in the ocean ? with my most incredible friend ?

A post shared by Katrina Kaif (@katrinakaif) on