అమెరికా నుంచి ఇన్ఫోసిస్ ఉద్యోగులు వెనక్కి !

అమెరికాలో తమ సంస్థకు చెంసిన 76 మంది ఉద్యోగులు, వారి కుటుంబాలను ఇండియాకు తిరిగి తీసుకువచ్చేందుకు ఇన్ఫోసిస్ చేసిన యత్నం ఫలించింది. ఈ ఉద్యోగుల్లో చాలామంది వీసాల కాల పరిమితి ముగియగా మరి కొందరి..

అమెరికా నుంచి ఇన్ఫోసిస్ ఉద్యోగులు వెనక్కి !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 07, 2020 | 3:33 PM

అమెరికాలో తమ సంస్థకు చెంసిన 76 మంది ఉద్యోగులు, వారి కుటుంబాలను ఇండియాకు తిరిగి తీసుకువచ్చేందుకు ఇన్ఫోసిస్ చేసిన యత్నం ఫలించింది. ఈ ఉద్యోగుల్లో చాలామంది వీసాల కాల పరిమితి ముగియగా మరి కొందరి వీసాల  గడువు త్వరలో ముగియనుంది. ఖతర్ ఎయిర్ వేస్ కి చెందిన విమానం శాన్ ఫ్రాన్సిస్కో నుంచి వీరిని బెంగుళూరుకు చేర్చింది. కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయిన కారణంగా తమ సిబ్బంది కోసం ఇన్ఫోసిస్ ప్రత్యేకంగా ఖతర్ ఎయిర్ లైన్స్ విమాన సౌకర్యాన్ని వినియోగించుకుంది. అమెరికాలో ఈ సంస్థ తరఫున దాదాపు 18 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. చాలామంది హెచ్-1 బీ వీసాలపై పని చేస్తుండగా.. ఇంట్రా-కంపెనీ ట్రాన్స్ ఫర్లలో వర్క్ చేస్తున్నవారు ఎల్-1 వీసాలను ఉపయోగించుకుంటున్నారు. హెచ్.1  బీ వీసా హోల్డర్లు ఆరేళ్ళ పాటు, ఎల్-1 వీసా హోల్డర్లు యుఎస్ లో అయిదేళ్ల పాటు ఉండవచ్ఛు. గతంలో భువనేశ్వర్ లో సంభవించిన వరదల సందర్భంలో కూడా ఇన్ఫోసిస్ తమ సుమారు ఐదు వందలమంది ఉద్యోగులను బెంగుళూరు, ఇతర కేంద్రాలకు రప్పించుకుంది.

Latest Articles
స్పాట్ ఫిక్సింగ్‌ కేసులో జైలుకు.. 5 ఏళ్ల నిషేధం.. కట్‌చేస్తే..
స్పాట్ ఫిక్సింగ్‌ కేసులో జైలుకు.. 5 ఏళ్ల నిషేధం.. కట్‌చేస్తే..
గొప్ప మైలేజీని అందించే బజాజ్ సీఎన్‌జీ బైక్‌లు..ఎప్పుడంటే..
గొప్ప మైలేజీని అందించే బజాజ్ సీఎన్‌జీ బైక్‌లు..ఎప్పుడంటే..
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా…? ఫామ్-16 విషయంలో ఆ తప్పు వద్దంతే
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా…? ఫామ్-16 విషయంలో ఆ తప్పు వద్దంతే
ఓటు వేయడానికి ఉదయాన్నే బయలుదేరాడు.. కేంద్రం సమీపంలోకి రాగానే..
ఓటు వేయడానికి ఉదయాన్నే బయలుదేరాడు.. కేంద్రం సమీపంలోకి రాగానే..
అందం ఈ వయ్యారితో పోటీలో ఒడి.. ఈమె వద్ద బందీగా మారిందేమో..
అందం ఈ వయ్యారితో పోటీలో ఒడి.. ఈమె వద్ద బందీగా మారిందేమో..
'తీవ్రమైన గాయాలు.. మెడిసిన్‌తోనే మైదానంలోకి ధోని'
'తీవ్రమైన గాయాలు.. మెడిసిన్‌తోనే మైదానంలోకి ధోని'
సైకిల్ బెల్ మాత్రమే మిగిలింది.. జగన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్
సైకిల్ బెల్ మాత్రమే మిగిలింది.. జగన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్
పీఎఫ్ సొమ్ము ఎన్ని రోజుల్లో అకౌంట్‌లో పడుతుందో తెలిస్తే షాకవుతారు
పీఎఫ్ సొమ్ము ఎన్ని రోజుల్లో అకౌంట్‌లో పడుతుందో తెలిస్తే షాకవుతారు
మా ముందు కోహ్లీ పప్పులుడకవ్.. అమెరికాలో ఆట కట్టిస్తాం: బాబర్
మా ముందు కోహ్లీ పప్పులుడకవ్.. అమెరికాలో ఆట కట్టిస్తాం: బాబర్
అయోధ్యలోని గోలు వీడియో వైరల్.. రెండు కోట్ల వ్యూస్..
అయోధ్యలోని గోలు వీడియో వైరల్.. రెండు కోట్ల వ్యూస్..