మ‌లేషియా, ఇండోనేషియాకు చెందిన వారిపై కేసులు..సహకరించిన వారిపైనా..

దేశంలో క‌రోనా విల‌య‌తాండ‌వం చేయ‌టానికి ప్ర‌ధాన కేంద్ర‌బిందువు ఢిల్లీప్రార్థ‌న‌లు. అక్క‌డి వెళ్లిన వారిలో సుమారుగా అంద‌రికీ క‌రోనా పాజిటివ్‌గా తేలిన విష‌యం తెలిసిందే. దీంతో మ‌ర్క‌జ్ ప్రార్థ‌న‌ల‌కు వెళ్లి..అధికారుల‌కు చెప్ప‌కుండా త‌ప్పించుకు తిరుగుతున్న వారిపై తెలంగాణ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ క్ర‌మంలోనే అటు క‌రీంన‌గ‌ర్‌, ఇటు హైద‌రాబాద్‌లోనూ ప‌లువురిని అదుపులోకి తీసుకున్నారు. మ‌రికొంద‌రిపై వివిధ సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేశారు. ఈ మేర‌కు పోలీసులు తెలిపిన స‌మాచారం మేర‌కు.. ఢిల్లీలోని తబ్లీగి జమాత్‌కు హాజరై […]

మ‌లేషియా, ఇండోనేషియాకు చెందిన వారిపై కేసులు..సహకరించిన వారిపైనా..
Follow us

|

Updated on: Apr 07, 2020 | 11:50 AM

దేశంలో క‌రోనా విల‌య‌తాండ‌వం చేయ‌టానికి ప్ర‌ధాన కేంద్ర‌బిందువు ఢిల్లీప్రార్థ‌న‌లు. అక్క‌డి వెళ్లిన వారిలో సుమారుగా అంద‌రికీ క‌రోనా పాజిటివ్‌గా తేలిన విష‌యం తెలిసిందే. దీంతో మ‌ర్క‌జ్ ప్రార్థ‌న‌ల‌కు వెళ్లి..అధికారుల‌కు చెప్ప‌కుండా త‌ప్పించుకు తిరుగుతున్న వారిపై తెలంగాణ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ క్ర‌మంలోనే అటు క‌రీంన‌గ‌ర్‌, ఇటు హైద‌రాబాద్‌లోనూ ప‌లువురిని అదుపులోకి తీసుకున్నారు. మ‌రికొంద‌రిపై వివిధ సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేశారు. ఈ మేర‌కు పోలీసులు తెలిపిన స‌మాచారం మేర‌కు..
ఢిల్లీలోని తబ్లీగి జమాత్‌కు హాజరై హైదరాబాద్‌లో తలదాచుకుంటున్న ఆరుగురు మలేషియన్లపై బంజారాహిల్స్‌ పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. టోలిచౌకి సమీపంలోని హకీంపేట మజీదు వద్ద మలేషియాకు చెందిన ఆరుగురిని గుర్తించారు. వారంతా మలేషియా వాసులు టూరిస్ట్‌ వీసాపై ఇండియాకు వచ్చి న్యూఢిల్లీలో జరిగిన తబ్లీగి జమాత్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఆరుగురు వ్య‌క్తులు మలేషియా వెళ్లేందుకు ప్రయత్నించగా అప్పటికే కరోనా వైరస్‌ విజృంభిస్తూ దేశంలో లాక్‌డౌన్‌ ప్రకటించారు.
ఈ నేపథ్యంలోనే ఈ ఆరుగురు న్యూఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్‌ హకీంపేటకు వచ్చి ఇక్కడ మసీదులో షెల్టర్‌ తీసుకున్నారు. మజీదు ఇన్‌చార్జి అనుమతితో రెండు రోజులుగా ఈ ఆరుగురు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే తలదాచుకున్నారు.  కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సమాచారం ఇవ్వకుండానే ఉండటాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించి సోదాలు నిర్వహించారు. వీరిపై ఎపిడమిక్‌ డిసీజెస్‌ యాక్ట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌తో పాటు ఐపీసీ సెక్షన్‌ 420, 269, 270, 188, 109, ఫారెనర్స్‌ యాక్ట్‌ కింద క్రిమినల్‌ కేసులు నమోదు చేసి గాంధీ ఆస్పత్రికి తరలించారు. మ‌లేషియ‌న్ల‌కు ఆశ్రయం కల్పించినందుకు హకీంపేట మజీదు ఇన్‌చార్జి మీద కూడా క్రిమినల్‌ కేసు నమోదైంది.
మ‌రోవైపు..కరీంనగర్​ వ‌న్‌టౌన్‌ పోలీస్​ స్టేషన్​లో 10 మంది ఇండోనేషియన్లపై కేసులు నమోదయ్యాయి. వారికి సహకరించిన వారిపై కేసు న‌మోదు చేసిన‌ట్లు స్థానిక సీఐ విజ‌య్‌కుమార్ తెలిపారు. టూరిస్ట్ వీసా మీద వచ్చి పర్యాటక కేంద్రాలను సందర్శించకుండా మసీదును సందర్శించడాన్ని పోలీసులు నేరంగా పరిగణిస్తున్నారు. సెక్షన్‌ 420, 269, 270, 188, యాక్ట్ 1897 సెక్షన్ 3 ప్రకారం కేసులు నమోదు చేశారు.
మార్చి 14న కరీంనగర్‌కు వచ్చిన ఇండోనేసియన్లు కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలకు విరుద్ధంగా వ్యవహరించి మతపరమైన సమావేశాల్లో పాల్గొన్న‌ట్లుగా చెప్పారు. వారి నిర్లక్ష్యం కారణంగా ఇతరులకు కూడా కరోనా సోకిందని చెప్పారు. ఈ విషయంపై కరీంనగర్‌ స్పెషల్‌ బ్రాంచి ఇన్‌స్పెక్టర్‌ ఇంద్రసేనారెడ్డి వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారని… దాంతో సదరు ఇండోనేసియన్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్