లద్ధాఖ్‌లో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. తుపాకీ ఎక్కు పెట్టి..

భారత్-చైనా సరిహద్దు ప్రాంతాల్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ క్షేత్ర స్థాయిలో రెండు రోజులు పర్యటన చేయనున్నారు. శుక్రవారం ఉదయం రాజ్‌నాథ్ సింగ్ లద్దాఖ్ చేరుకున్నారు. భారత్-చైనా దేశాల మధ్య సరిహద్దు ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితులను...

లద్ధాఖ్‌లో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. తుపాకీ ఎక్కు పెట్టి..
Follow us

| Edited By:

Updated on: Jul 17, 2020 | 11:30 AM

భారత్-చైనా సరిహద్దు ప్రాంతాల్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ క్షేత్ర స్థాయిలో రెండు రోజులు పర్యటన చేయనున్నారు. శుక్రవారం ఉదయం రాజ్‌నాథ్ సింగ్ లద్దాఖ్ చేరుకున్నారు. భారత్-చైనా దేశాల మధ్య సరిహద్దు ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితులను సమీక్షించేందుకు ఆయన పర్యటిస్తున్నారు. గత నెలలో గాల్వాన్ లోయలో ఇరు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత జవాన్లు కన్ను మూశారు. ఇక ఇరు దేశాల మధ్య చర్చల అనంతరం సమస్యాత్మక ప్రాంతాల నుంచి భారత్-చైనాలు తమ బలగాలను ఉపసంహరించుకున్నారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ కూడా లద్ధాఖ్‌లో పర్యటించి, ఘర్షణలో గాయపడ్డ జవాన్లను పరామర్శించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో చైనా సరిహద్దులో భారత సైనిక సేనల సన్నద్ధతను సమీక్షించేందుకు రాజ్‌నాథ్ సింగ్ లద్ధాఖ్‌లో పర్యటిస్తున్నారు. ఆయన వెంట డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవనె సహా పలువురు ఉన్నత సైనికాధికారులు ఉన్నారు. కాగా రాజ్‌నాథ్ సింగ్ లద్ధాఖ్, సెక్టార్ 4, వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితులను ఆయన సమీక్షిస్తారు. రెండు రోజులు పర్యటనలో భాగంగా ఆయన శనివారం శ్రీనగర్‌లో పర్యటిస్తారు.

Read More: షేర్ ఇట్‌కు ధీటుగా భారత్ ‘షేర్ యాప్’..