షేర్ ఇట్‌కు ధీటుగా భారత్ ‘షేర్ యాప్’..

గాల్వాన్ లోయలో ఘర్షణ అనంతరం భారత్ సంచలనమైన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. చైనా దేశానికి సంబంధించిన 59 యాప్స్‌ని భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం మరికొన్ని యాప్స్ బ్యాన్‌పై కూడా దృష్టి పెట్టింది. ఇక భారత ఆర్మీ జవాన్లు కూడా ఫేస్ బుక్..

షేర్ ఇట్‌కు ధీటుగా భారత్ 'షేర్ యాప్'..
Follow us

| Edited By:

Updated on: Jul 17, 2020 | 10:58 AM

గాల్వాన్ లోయలో ఘర్షణ అనంతరం భారత్ సంచలనమైన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. చైనా దేశానికి సంబంధించిన 59 యాప్స్‌ని భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం మరికొన్ని యాప్స్ బ్యాన్‌పై కూడా దృష్టి పెట్టింది. ఇక భారత ఆర్మీ జవాన్లు కూడా ఫేస్ బుక్, పబ్ జీ, ఇన్‌స్టా గ్రామ్ వంటి యాప్స్‌‌ని నిషేధించారు. దీంతో చైనా యాప్స్‌కు ధీటుగా భారత్ కూడా యాప్స్ రెడీ చేస్తోంది. ఇందులో భాగంగానే ‘షేర్ ఇట్’ మాదిరి ‘భారత్ షేర్ యాప్’ను రెడీ చేశారు నలుగురు స్టూడెంట్స్.

షేర్‌ ఇట్‌లో ఎలాగైతే వీడియోలు, ఫొటోలు, డ్యాక్యుమెంట్లు, యాప్స్ షేర్ చేసుకుంటామో.. ఇండియా షేర్ అనే యాప్‌లోనూ  అలాగే చేసుకోవచ్చు. ఈ యాప్‌ను విశాఖకు చెందిన ఓ విద్యార్థి, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మరో ముగ్గురు విద్యార్థులు ఈ యాప్‌ను తయారు చేశారు. పైథాన్, సీ++, డాట్ నెట్ తదితర పరిజ్ఞానంతో షేర్ ఇట్‌కు దీటుగా ఈ యాప్‌ను ఆవిష్కరించారు.

బీఎస్ఎస్ మాధవ్, ప్రశాత్ సెంగర్, రితేశ్ సింగ్, ప్రీత్ త్యాగి స్టూడెంట్స్ చిన్నప్పటి నుంచి స్నేహితులు. అయినా వీరంతా వేర్వేరు ప్రాంతాల్లో ఇంజినీరింగ్ చదువుతున్నారు. కరోనా ఉన్నందున.. ప్రస్తుతం కాలేజీలకు సెలవులు ప్రకటించడంతో వీరంతా కలిసి ఇండియా షేర్ యాప్‌ను ఆవిష్కరించారు. నలుగురు నాలుగు ప్రాంతాల్లో ఉండటంతో వీడియో కాల్స్, టెలీ కాన్ఫరెన్స్‌ల ద్వారా అనుకున్నది సాధించారు. ఇండియా షేర్ యాప్‌ను.. చైనా షేర్ ఇట్‌కు ధీటుగా రూపొందించినట్లు ఆ నలుగురు స్టూడెంట్స్ తెలిపారు.

Read More: 

ప్రపంచ వ్యాప్తంగా కరోనా టెర్రర్.. తీవ్రంగా పెరుగుతోన్న కేసులు..