కొంపముంచిన బర్త్ డే పార్టీ.. ఏకంగా 45 మందికి కరోనా.. హైదరాబాద్‌లో టెన్షన్..

గ్రేటర్ హైదరాబాద్‌లో లాక్ డౌన్ ఎంత కఠినంగా అమలు చేస్తున్నా కరోనా కేసులు మాత్రం అంతకంతకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా కరోనా కేసులకు ఎల్‌బీ నగర్ హాట్ స్పాట్‌గా మారడంతో ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. అక్కడ ఓ వ్యాపారి తన మిత్రులకు ఇచ్చిన బర్త్ డే పార్టీ మొత్తంగా ఆ ప్రాంతవాసుల కొంప ముంచింది. వివరాల్లోకి వెళ్తే.. మలక్‌పేట గంజ్‌కు చెందిన ఓ వ్యాపారి తన ఫ్రెండ్స్‌కి బర్త్ డే దావత్ ఇచ్చాడు. దాని కారణంగా […]

కొంపముంచిన బర్త్ డే పార్టీ.. ఏకంగా 45 మందికి కరోనా.. హైదరాబాద్‌లో టెన్షన్..
Follow us

|

Updated on: May 11, 2020 | 8:01 AM

గ్రేటర్ హైదరాబాద్‌లో లాక్ డౌన్ ఎంత కఠినంగా అమలు చేస్తున్నా కరోనా కేసులు మాత్రం అంతకంతకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా కరోనా కేసులకు ఎల్‌బీ నగర్ హాట్ స్పాట్‌గా మారడంతో ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. అక్కడ ఓ వ్యాపారి తన మిత్రులకు ఇచ్చిన బర్త్ డే పార్టీ మొత్తంగా ఆ ప్రాంతవాసుల కొంప ముంచింది. వివరాల్లోకి వెళ్తే.. మలక్‌పేట గంజ్‌కు చెందిన ఓ వ్యాపారి తన ఫ్రెండ్స్‌కి బర్త్ డే దావత్ ఇచ్చాడు. దాని కారణంగా సుమారు 45 మందికి కరోనా వైరస్ సోకినట్లు అధికారుల నిర్ధారణలో తేలింది. ఈ ఎఫెక్ట్ వల్ల మొత్తంగా 15 చోట్ల కంటైన్‌మెంట్ జోన్లను ఏర్పాటు చేసి అధికారులు లాక్ డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు.

మలక్‌పేట్‌ మార్కెట్ లింక్‌తో వనస్థలీపురంలో ఏరియాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రధానంగా ఒకరి నుంచి 16 మందికి కరోనా సోకగా.. మరొకరి ద్వారా 11 మందికి వైరస్ పాకింది. ఇక గ్రేటర్‌లో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. అందులోనూ ఎల్బీ నగర్ ఏరియాలోనే ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. నిన్న నమోదైన 33 కేసుల్లో 4 కేసులు వనస్థలీపురం, ఎల్బీ నగర్ జోన్లకు  సంబంధించనవి కావడం గమనార్హం. దీనితో జీహెచ్ఎంసీ అధికారులు ఒక్కసారిగా అలెర్ట్ అయ్యి ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. నోడెల్ టీంలను ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు.

Also Read: నార్త్ కొరియాలో మరోసారి కలకలం.. కిమ్‌కు ప్రాణ సంకటం.!