AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సింపుల్‌గా హ్యాండ్ శానిటైజర్‌ ఇంట్లోనే రెడీ చేసుకోండి.. కరోనాకు చెక్ పెట్టండి..!

కరోనా.. ఈ వైరస్ పేరు వింటే చాలు. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్ని గజగజవణికిపోతున్నాయి. ఇప్పటికే ఈ రక్కసి బారినపడి మూడు వేలమందికి పైగా మరణించారు. లక్షమంది వరకు దీని ప్రభావంతో ఆస్పత్రిపాలయ్యారు. ఇంతలా వణికిస్తున్న ఈ మహమ్మారి ఇప్పుడు మన దేశంలో కూడా వణకిస్తుంది. దీంతో మార్కెట్‌లో డిమాండ్ లేని వస్తువులకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. మాస్క్‌లు, శానిటైజర్ వంటి వాటిని మనదేశంలో ఉపయోగించడం చాలా అరుదు. కానీ ఈ కరోనా ఎఫెక్ట్‌తో ఇప్పుడు విపరీతమైన డిమాండ్ […]

సింపుల్‌గా హ్యాండ్ శానిటైజర్‌ ఇంట్లోనే రెడీ చేసుకోండి.. కరోనాకు చెక్ పెట్టండి..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 07, 2020 | 8:50 PM

Share

కరోనా.. ఈ వైరస్ పేరు వింటే చాలు. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్ని గజగజవణికిపోతున్నాయి. ఇప్పటికే ఈ రక్కసి బారినపడి మూడు వేలమందికి పైగా మరణించారు. లక్షమంది వరకు దీని ప్రభావంతో ఆస్పత్రిపాలయ్యారు. ఇంతలా వణికిస్తున్న ఈ మహమ్మారి ఇప్పుడు మన దేశంలో కూడా వణకిస్తుంది. దీంతో మార్కెట్‌లో డిమాండ్ లేని వస్తువులకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. మాస్క్‌లు, శానిటైజర్ వంటి వాటిని మనదేశంలో ఉపయోగించడం చాలా అరుదు. కానీ ఈ కరోనా ఎఫెక్ట్‌తో ఇప్పుడు విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీనికి ముఖ్య కారణం. కరోనాను ఎదుర్కోవాలంటే.. ఎప్పుడూ శుభ్రతను పాటించాల్సిందే. ఇంట్లో ఉన్నసమయంలో కానీ.. ఆఫీసులో ఉన్నప్పుడు కానీ.. చేతుల్ని సబ్బు పెట్టి కడుక్కునే అవకాశం ఉంది. అయితే బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా శానిటైజర్ వాడాల్సిందే. దీంతో ఇప్పుడు దేశంలో ఈ శానిటైజర్ల వాడకం పెరిగిపోయింది. అయితే డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తి లేకపోవడంతో.. వీటి ధరలను మార్కెట్లో అధిక ధరలకు అమ్ముతూ.. సామాన్యులకు దూరం చేస్తున్నారు. అంతే కాదు.. ప్రస్తుతం దొరకడం కూడా చాలా కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో శానిటైజర్‌ను సొంతంగా తయారు చేసుకుంటే ఈ సమస్యకు పరిష్కారం దొరికినట్లే. అయితే ఈ హ్యాండ్‌ శానిటైజర్లను మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు.

కావాల్సిన పదార్థాలు..

* రెండు కప్పుల రబ్బింగ్‌ ఆల్కహాల్‌. ఈ రబ్బింగ్ ఆల్కాహాల్ అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఆన్‌లైన్ స్టోర్‌లో లభ్యమవుతుంది. * ఒక కప్పు అలోవెరా గుజ్జు * 8 నుంచి 10 చుక్కల టీట్రీ ఎసెన్షియల్‌ ఆయిల్‌

తయారీ విధానం..

రబ్బింగ్‌ ఆల్కహాల్‌ను, అలోవెరా గుజ్జును ఓ పాత్రలో వేయాలి. అనంతరం రెండిటిని బాగా కలిసేదాకా చెంచాతో మిక్స్ చేయాలి. అలా కలుపుతూ.. చివర్లో ఎసెన్షియల్ ఆయిల్‌ను కలపాలి. అంతే సింపుల్‌గా హ్యాండ్‌ శానిటైజర్‌ రెడీ అయినట్లే. ఈ మిశ్రమాన్ని ఏదైన బాటిళ్లో పోసి.. ఉపయోగించుకుంటే చాలు. అయితే ఈ మిశ్రమం కాస్త చిక్కగా రావాలంటే.. రబ్బింగ్ ఆల్కాహాల్‌తో కలిపేటప్పుడు.. కాస్త ఆలోవెరా గుజ్జును కలుపుకోవచ్చు. ఒకవేళ కాస్త ద్రవంలా కావాలంటే.. మరో చెంచా రబ్బింగ్ ఆల్కహాల్‌ కలుపుకోవచ్చు.

జాగ్రత్తలు.. సరైన మోతాదులో కలపకుంటే ప్రమాదమంటున్నారు వైద్య నిపుణులు. ఖచ్చితంగా ఈ మిశ్నమాన్ని కలిపే సమయంలో దానిలో రబ్బింగ్ ఆల్కహాల్ 60 శాతం తప్పనిసరిగా ఉండాలని సూచిస్తున్నారు.