హిమాచల్‌ప్రదేశ్‌ మంత్రికి కరోనా

హిమాచల్‌ ప్రదేశ్ మంత్రికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. పవర్ మినిష్టర్‌ సుఖ్రం చౌదరీకి గురువారం కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు స్వయంగా ఆయనే తెలిపారు. తన అధికారిక ట్విటట్ర్‌ ఖాతా ద్వారా..

హిమాచల్‌ప్రదేశ్‌ మంత్రికి కరోనా

హిమాచల్‌ ప్రదేశ్ మంత్రికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. పవర్ మినిష్టర్‌ సుఖ్రం చౌదరీకి గురువారం కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు స్వయంగా ఆయనే తెలిపారు. తన అధికారిక ట్విటట్ర్‌ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. తాను చేయించుకున్న కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ అని వచ్చిందని.. ఇటీవల తనతో కలిసిన వారు స్వయంగా ఐసోలేషన్‌కి వెళ్లి కరోనా పరీక్షలు చేయించుకోవాలంటూ కోరారు. కాగా, జూలై 30వ తేదీన షిమ్లాలో ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇదిలావుంటే.. గత కొద్ది రోజులుగా హిమాచల్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభంతో కేసులు పెరిగినట్లు తెలుస్తోంది.

 

Read More :

దేశ రాజధానిలో పెరిగిన కరోనా కేసులు

మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

Click on your DTH Provider to Add TV9 Telugu