దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ విజయ్ భారీ విరాళాలు

ఈ క్రమంలో ఆయన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్‌కు కూడా రూ.5 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. అలాగే ప్రధాని మంత్రి రిలీఫ్ ఫండ్‌కు రూ.25 లక్షలు, తమిళనాడుకు రూ.50 లక్షలు..

  • Tv9 Telugu
  • Publish Date - 5:09 pm, Wed, 22 April 20
దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ విజయ్ భారీ విరాళాలు

కరోనా వైరస్‌ను అరికట్టడంలో భాగంగా ఆయా ప్రభుత్వాలకు అండగా నిలిచేందుకు పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే విరాళాలు అందించారు. ఇప్పుడు తన వంతుగా దక్షిణాది రాష్ట్రాలకు తన వంత సాయంగా రూ.1.3 కోట్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు దళపతి అలియాస్ విజయ్. ఈ క్రమంలో ఆయన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్‌కు కూడా రూ.5 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. అలాగే ప్రధాని మంత్రి రిలీఫ్ ఫండ్‌కు రూ.25 లక్షలు, తమిళనాడుకు రూ.50 లక్షలు, కేరళలకు రూ.10 లక్షలు, ఫెప్సీకి రూ.25 లక్షలు, కేరళకు రూ.10 లక్షలు, కర్ణాటకకు రూ.5 లక్షలు, పాండిచ్చెరీకి రూ.5 లక్షలను విజయ్ విరాళాలుగా ప్రకటించారు. కరోనా వ్యాప్తి చెందకుండా చేస్తున్న పోరాటానికి విజయ్ ఒక కోటి 30 లక్షల రూపాయలను విరాళంగా ఇవ్వడంపై ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విజయ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా దక్షిణాదిలో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో విజయ్ ఆందోళన చెందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతని కుమారుడు జాన్సన్.. ప్రస్తుతం కెనడాలో చిక్కుపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

Read More: 

సీఎం కేసీఆర్‌కు ఆర్జీవీ దిమ్మతిరిగే ఛాలెంజ్..

జగన్ ప్రభుత్వం వల్ల రూ.1400 కోట్లు వృథా.. కన్నా సంచలన వ్యాఖ్యలు

పవన్‌తో సినిమా నేను చేయలేను.. జక్కన్న సెన్సేషనల్ కామెంట్స్

ట్రాన్స్‌జెండర్లకు కేంద్రం గుడ్‌న్యూస్.. అన్ని అప్లికేషన్స్‌లోనూ..