AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాక్‌డౌన్ ఎఫెక్ట్ః అక్క‌డి పేదలకు 2 శాతం వడ్డీకే రుణాలు

రుణం ఇచ్చిన ఆరు నెలల తర్వాత ఇన్‌స్టాల్‌మెంట్ కట్టడం మొదలు పెట్టాలి. పైగా రుణాల కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఎలాంటి గ్యారెంటీ అవసరం ఉండ‌ద‌ని సీఎం..

లాక్‌డౌన్ ఎఫెక్ట్ః అక్క‌డి పేదలకు 2 శాతం వడ్డీకే రుణాలు
Jyothi Gadda
|

Updated on: May 15, 2020 | 2:22 PM

Share

క‌రోనా, లాక్‌డౌన్ కార‌ణంగా దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ఉపాధి లేక చేతిలో డ‌బ్బులు లేక అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో ‘కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కింద రూ.20లక్షల కోట్లతో ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో భాగంగా రాష్ట్రాలు కూడా పేద‌ల‌కు ల‌బ్ధిచేకూరేలా ప‌లు ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెడ్డుతున్నాయి.

క‌రోనా క‌ష్టాలు ప‌డుతున్న రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు గుజ‌రాత్ సీఎం విజయ్ రుపానీ కొత్త స్కీం ప్ర‌క‌టించారు. ఆత్మనిర్భర్ గుజరాత్ సహాయ్ యోజన్ ప‌థ‌కం ద్వారా పేద‌ల‌ను ఆదుకోనున్నారు. ఆత్మ నిర్భర్ గుజరాత్ సహాయ్ యోజన పథకం ద్వారా చిరు వ్యాపారులు, స్కిల్డ్ లేబర్, ఆటో వాలాలకు, ఎలక్ట్రీషియన్లకు, బార్బర్లు, మొద‌ల‌గు 10ల‌క్ష‌ల మందికి లాభం జరుగుతుంద‌ని చెప్పారు. ఆత్మ నిర్భర్ గుజరాత్ సహాయ్ యోజన పథకం కింద అతి తక్కువ ఆదాయం ఉన్న వారికి రూ.లక్ష వరకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించ‌నున్నారు. రుణాలు తీసుకున్న వారు కేవలం 2 శాతం వడ్డీ కడితే చాలు. మరో ఆరు శాతం వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు చెల్లిస్తుంది.

చిన్న, సూక్ష్మ తరహా వ్యాపారాలు చేసుకునే వారికి కూడా ఈ పథకం వల్ల మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఆత్మ నిర్భర్ గుజరాత్ సహాయ్ యోజన పథకం కింద రుణాలు తీసుకునే వారు మూడు సంవత్సరాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. రుణం ఇచ్చిన ఆరు నెలల తర్వాత ఇన్‌స్టాల్‌మెంట్ కట్టడం మొదలు పెట్టాలి. పైగా రుణాల కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఎలాంటి గ్యారెంటీ అవసరం ఉండ‌ద‌ని సీఎం విజ‌య్ రూపానీ స్ప‌ష్టం చేశారు.

Follow Us
మహిళలకు గుడ్‌న్యూస్.. ఏపీలో మరో 913 ఆశావర్కర్ ఉద్యోగాలు!
మహిళలకు గుడ్‌న్యూస్.. ఏపీలో మరో 913 ఆశావర్కర్ ఉద్యోగాలు!
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?