తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఇంటింటికీ వైద్య పరీక్షలు..
కరోనా నేపధ్యంలో తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటింటికీ వెళ్లి వైద్య సిబ్బంది పరీక్షలు చేయనున్నారు. తాజాగా జిల్లా వైద్య అధికారులు, హాస్పిటల్ సూపరింటెండెంట్‌లు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్స్, ఏఎన్ఎం, ఆశా వర్కర్స్‌తో జరిగిన విడియో కాన్ఫరెన్స్‌లో ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. Watch Live: లాక్ డౌన్ అమలుపై కేసీఆర్ కీలక నిర్ణయం ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి […]

కరోనా నేపధ్యంలో తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటింటికీ వెళ్లి వైద్య సిబ్బంది పరీక్షలు చేయనున్నారు. తాజాగా జిల్లా వైద్య అధికారులు, హాస్పిటల్ సూపరింటెండెంట్‌లు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్స్, ఏఎన్ఎం, ఆశా వర్కర్స్‌తో జరిగిన విడియో కాన్ఫరెన్స్‌లో ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
Watch Live: లాక్ డౌన్ అమలుపై కేసీఆర్ కీలక నిర్ణయం
ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి పరీక్షలు నిర్వహించాలన్నారు. జలుబు, జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ఊపిరితిత్తుల్లో న్యుమోనియా వంటి లక్షణాలు ఉన్నవారికి తప్పనిసరిగా పరీక్షలు చేయాలని మంత్రి అన్నారు. ఒక్కొ ఏ.ఎన్.ఎంకు వంద ఇళ్లు కేటాయించనుండగా.. మూడు, నాలుగు రోజుల్లో వైద్య పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.
Read This: జూన్ 30 వరకు అన్నీ రైళ్ల టికెట్లు రద్దు.. శ్రామిక్ రైళ్లు మాత్రమే!
