No Holi celebrations: హోలీని అలా జరుపుకోవడం కుదరదు.. కీలక నిర్ణయం తీసుకున్న గుజరాత్ సర్కార్
Holi Celebrations: రాష్ట్ర ప్రభుత్వాలు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పాక్షిక లాక్‌డౌన్, రాత్రి కర్ఫ్యూలు కూాడావిధించాయి...
Holi Celebrations: దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో దాదాపు చాలా రాష్ట్రాలు వైరస్ విజృంభిస్తోంది. దీంతో కోవిడ్ వైరస్ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పాక్షిక లాక్‌డౌన్, రాత్రి కర్ఫ్యూలు కూాడావిధించాయి. తాజా గుజరాత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ నెల 29 జరుగనున్న సామూహిక హోలీ వేడుకలకు అనుమతి ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. కరోనా నిబంధనలు పాటిస్తూ హోలికా దహనం మాత్రమే నిర్వహించుకోవాలని ఆ రాష్ట్ర ప్రజలకు అక్కడి ప్రభుత్వం సూచించింది. హోలీ వేడుకలు జరుగనుండగా.. వేడుకలకు ముందురోజు హోలికా దహనాన్ని నిర్వహిస్తారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా జరుపుకునే హోలీ వేడుకల్లో భాగంగా హోలికా దహనానికి మాత్రమే అనుమతి ఇచ్చింది గుజరాత్ ప్రభుత్వం. గ్రామస్తులు, హౌజింగ్ సొసైటీ సభ్యులు సాధ్యమైనంత తక్కువ మందితో ఈ వేడుక నిర్వహించుకోవాలని డిప్యూటీ సీఎం నితీన్ పటేల్ పేర్కొన్నారు. ప్రజలు గుంపులుగా సంచరించేందుకు వీల్లేదని అన్నారు. ఒకరికొకరు రంగులు పులుముకోవడం నిషేధం అని తెలిపారు. హోలీ వేడుకలకు అనుమతి లేదని. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్నందున ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాని నితీన్ పటేల్ వార్నింగ్ ఇచ్చారు .
ఇవి కూడా చదవండి : Malaika Arora Is The Hottest: బోల్డ్ ఫోటోలతో కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తున్న మలైకా అరోరా.. లైక్ చేసిన ప్రియుడు అర్జున్ కపూర్