భారత్‌లో ఫిబ్రవరి కల్లా కరోనా అంతం..

భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తిపై అధ్యయనం చేసేందుకు కేంద్రం ప్రభుత్వం ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం దేశంలో కరోనా ముమ్మర దశను దాటిందని..

భారత్‌లో ఫిబ్రవరి కల్లా కరోనా అంతం..
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 18, 2020 | 4:44 PM

India Crossed Covid Peak: భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తిపై అధ్యయనం చేసేందుకు కేంద్రం ప్రభుత్వం ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం దేశంలో కరోనా ముమ్మర దశను దాటిందని.. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి మహమ్మారి పూర్తిగా అంతమవుతుందని ఆ కమిటీ స్పష్టం చేసింది. ప్రజలు ఏమరుపాటుగా ఉండకూడదన్నారు.

కేంద్రం జారీ చేసిన కోవిడ్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని కోరింది. అంతేకాదు 2021 ఫిబ్రవరి నాటికి సుమారు కోటి ఐదు లక్షల మంది కరోనా బారిన పడతారని కమిటీ అంచనా వేసింది. ఇక వింటర్ సీజన్‌లో రెండో విడత కరోనా వైరస్ కేసులు పెరిగే అవకాశం ఉందని నీతి అయోగ్ సభ్యులు వీకే పాల్ హెచ్చరించారు.

Also Read: వాళ్లకే తొలి దశ కరోనా వ్యాక్సిన్: కేంద్రం