Coronavirus Vaccine: ‘కరోనా’ వ్యాక్సిన్‌ కోసం ట్రంప్ కుట్ర.. జర్మనీ ఫైర్..!

కరోనా విస్తరిస్తోన్న ప్రపంచవ్యాప్తంగా దేశాలు అప్రమత్తమయ్యాయి. కొత్తగా పుట్టుకొచ్చిన ఈ వైరస్‌ ఆట కట్టించే వ్యాక్సిన్‌ను తయారుచేసే పనిలో అన్ని దేశాలు పడ్డాయి. ఈ క్రమంలో జర్మనీకి చెందిన క్యూర్‌వ్యాక్ అనే ఔషద పరిశోధన సంస్థ కరోనాకు వ్యాక్సిన్‌ను కనుగొనడంలో కొంత పురోగతి సాధించింది. ఇదిలా ఉంటే ఈ వ్యాక్సిన్‌ను హస్తగతం చేసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుట్ర పన్నినట్లు జర్మనీ మీడియాలో ఓ కథనం ప్రచురితమైంది. క్యూర్‌వ్యాక్‌కు భారీ డబ్బును ఇచ్చేందుకు సిద్ధమైన ట్రంప్.. […]

Coronavirus Vaccine: 'కరోనా' వ్యాక్సిన్‌ కోసం ట్రంప్ కుట్ర.. జర్మనీ ఫైర్..!
Follow us

| Edited By:

Updated on: Mar 16, 2020 | 2:15 PM

కరోనా విస్తరిస్తోన్న ప్రపంచవ్యాప్తంగా దేశాలు అప్రమత్తమయ్యాయి. కొత్తగా పుట్టుకొచ్చిన ఈ వైరస్‌ ఆట కట్టించే వ్యాక్సిన్‌ను తయారుచేసే పనిలో అన్ని దేశాలు పడ్డాయి. ఈ క్రమంలో జర్మనీకి చెందిన క్యూర్‌వ్యాక్ అనే ఔషద పరిశోధన సంస్థ కరోనాకు వ్యాక్సిన్‌ను కనుగొనడంలో కొంత పురోగతి సాధించింది. ఇదిలా ఉంటే ఈ వ్యాక్సిన్‌ను హస్తగతం చేసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుట్ర పన్నినట్లు జర్మనీ మీడియాలో ఓ కథనం ప్రచురితమైంది. క్యూర్‌వ్యాక్‌కు భారీ డబ్బును ఇచ్చేందుకు సిద్ధమైన ట్రంప్.. తద్వారా ఆ వ్యాక్సిన్ హక్కులను కేవలం అమెరికాకే పరిమితం చేసుకోవాలని భావించినట్లు ఆ కథనంలో వెల్లడించారు.

దీనికి తోడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌తో క్యూర్‌వ్యాక్ చీఫ్ ఎగ్జిగ్యూటివ్ గత నెల భేటీ కావడంతో.. ఆ ఆరోపణలకు బలం చేకూరింది. ఈ నేపథ్యంలో ఈ కథనంపై జర్మనీ ఆర్థిక మంత్రి పీటర్ ఆల్ట్‌మైర్ మండిపడ్డారు. జర్మనీ అమ్మకానికి లేదంటూ ఆయన ఘాటుగా స్పందించారు. ఈ పరిశోధనకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని జర్మనీ ప్రభుత్వమే చెల్లించినట్లు వెల్లడించింది. మరోవైపు ఈ కథనంపై ఆ దేశ ఆరోగ్య మంత్రి జెన్స్ స్పాన్ మాట్లాడుతూ.. క్యూర్‌వ్యాక్‌ తయారు చేసే వ్యాక్సిన్‌ను ట్రంప్‌ సొంతం చేసుకోలేరు. అదొక డెవలప్ వ్యాక్సిన్ మాత్రమే. ప్రపంచదేశాలు అన్నింటికి ఇది సొంతం. అంతేకాదు కొన్ని దేశాలకు మాత్రమే కాదని ఆయన అన్నారు. ఇక మరోవైపు ఈ కథనం నేపథ్యంలో జర్మనీ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఈ వ్యాక్సిన్‌ను జర్మనీ నుంచి తరలిపోకుండా చూసేందుకు జర్మనీ ప్రభుత్వం అప్రమత్తమైనట్లు సమాచారం.

Read This Story Also: నాకు ప్రభాస్‌తో ఉన్న బంధం అదే: అనుష్క