Vaccine Finder: మీకు ద‌గ్గ‌ర్లోని వ్యాక్సిన్ సెంట‌ర్ ఎక్క‌డుందో ఫేస్‌బుక్ చెబుతుంది.. అందుబాటులోకి కొత్త టూల్‌..

Vaccine Finder Tool In FaceBook: ప్ర‌స్తుతం క‌రోనా మ‌హ‌మ్మారిని ఎదుర్కొవ‌డానికి మ‌న ద‌గ్గ‌ర ఉన్న ఏకైక అస్త్రం వ్యాక్సినేష‌న్‌. వ్యాక్సిన్ చేయించుకున్న వారు క‌రోనా భారిన ప‌డే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉన్నాయ‌ని...

Vaccine Finder: మీకు ద‌గ్గ‌ర్లోని వ్యాక్సిన్ సెంట‌ర్ ఎక్క‌డుందో ఫేస్‌బుక్ చెబుతుంది.. అందుబాటులోకి కొత్త టూల్‌..
Vaccine Find Tool
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 30, 2021 | 8:05 PM

Vaccine Finder Tool In FaceBook: ప్ర‌స్తుతం క‌రోనా మ‌హ‌మ్మారిని ఎదుర్కొవ‌డానికి మ‌న ద‌గ్గ‌ర ఉన్న ఏకైక అస్త్రం వ్యాక్సినేష‌న్‌. వ్యాక్సిన్ చేయించుకున్న వారు క‌రోనా భారిన ప‌డే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉన్నాయ‌ని ఇప్ప‌టికే ప‌లు ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారంద‌రికీ వ్యాక్సిన్ అందించ‌నున్న నేప‌థ్యంలో ఇప్ప‌టికే రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ మొదలైంది. ఇదిలా ఉంటే వ్యాక్సిన్ సెంట‌ర్ ఎక్క‌డుందో తెలుసుకోవ‌డంలో ఇబ్బందులు ఎదుర‌వుతుంటాయి. ఇది స‌హ‌జ‌మైన విష‌య‌మే.. ఈ స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌డానికే ఫేస్‌బుక్ స‌రికొత్త ఫీచ‌ర్‌తో ముందుకు రానుంది. భార‌త్‌లో వ్యాక్సిన్ ఫైండ‌ర్ పేరుతో ఓ టూల్‌ను తీసుకురావ‌డానికి సన్నాహాలు చేస్తోంది. త్వ‌ర‌లోనే ఈ టూల్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఫేస్‌బుక్ ఈ టూల్‌ను భార‌త ప్ర‌భుత్వ భాగస్వామ్యంతో రూపొందిస్తోంది. దేశంలోని 17 స్థానిక భాష‌ల్లో ఇందులో స‌మాచారం అందుబాటులో ఉంచ‌నున్నారు. ఫేస్‌బుక్ యాప్‌లో అందుబాటులో ఉండే ఈ టూల్‌తో యూజ‌ర్లు త‌మ‌కు ద‌గ్గ‌ర్లో ఉన్న వ్యాక్సిన్ సెంట‌ర్ల‌ను క‌నుక్కోవ‌చ్చు. కేంద్ర ఆరోగ్య శాఖ అందించిన వివ‌రాల ఆధారంగా వ్యాక్సినేష‌న్ సెంట‌ర్ల లొకేష‌న్లు, వాటి ప‌ని వేళ‌ల‌కు సంబంధించిన స‌మాచారాన్ని అందిస్తుంది. ఇక ఈ టూల్‌లో కోవిన్ పోర్ట‌ల్‌ను కూడా లింక్ చేసి ఉంచారు. దీని ద్వారా టూల్ ద్వారానే వ్యాక్సినేష‌న్ రిజిస్ట్రేష‌న్ కూడా చేసుకోవ‌చ్చు. ఫేస్‌బుక్‌లోని కొవిడ్ 19 ఇన్ఫ‌ర్మేష‌న్ సెంట‌ర్‌లో ఈ టూల్ అందుబాటులో ఉంటుంది.

Also Read: మలేరియాకు వ్యాక్సిన్ వచ్చిందా..! యాబై వేల ఏళ్ల నాటి వ్యాధికి టీకా..? మరి కరోనా సంగతేంటి..

viral, జస్టిస్ చంద్రచూడ్ ‘పడిపోయారా ‘ ? సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా సరికొత్త గమ్మత్తు !

Oxygen: ప్రాణవాయువును అందించే ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు..ఎలా పనిచేస్తాయి..ఇవి ఇచ్చే ఆక్సిజన్ ఎంత ఉపయోగకరం..