AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉద్యోగులకు శుభవార్త…పూర్తి వేతనాలకు సర్కార్ గ్రీన్‌సిగ్నల్

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ సర్కార్ శుభవార్తనందించింది.  ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ నెల పూర్తి వేతనం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ఆదాయ పరిస్థితి మెరుగవుతున్నందున సీఎం కేసీఆర్‌ ఈ మేరకు..

ఉద్యోగులకు శుభవార్త...పూర్తి వేతనాలకు సర్కార్ గ్రీన్‌సిగ్నల్
Jyothi Gadda
|

Updated on: Jun 23, 2020 | 8:10 PM

Share

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ సర్కార్ శుభవార్తనందించింది.  ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ నెల పూర్తి వేతనం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ఆదాయ పరిస్థితి మెరుగవుతున్నందున సీఎం కేసీఆర్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల పూర్తి వేతనాలు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో గత మూడు నెలలుగా అరకొర జీతాలు తీసుకున్న వారంతా ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా, లాక్‌డౌన్ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయంపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు ఇలా అందరి జీతాల్లో కోత పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఏప్రిల్, మే నెల వేతనాల్లో కోత పడింది. దీనిపై మొదటి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నాయి ఉద్యోగ సంఘాలు. జూన్ నెల నుంచైనా పూర్తి వేతం ఇవ్వాలని కోరుతూ.. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్ మరియు కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక పక్షాన కొంతమంది ప్రతినిధులు మంగళవారం ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావును కలిసి వారి సమస్యలను వివరించారు. . జీతాల్లో కోతలతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. వారి సమస్యలపై సానుకూలంగా స్పందించిన సర్కార్ జూన్ నెల నుంచి పూర్తి వేతనాలు చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అయితే, ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ జూన్ నెల నుండి పూర్తి వేతనాలు, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వడానికి  అంగీకరించింది.. అదే విధంగా బకాయిలకు సంబంధించి జీపీఎఫ్‌లో జమ చేయాలనుకుంటున్నామని, ఇదే సమయంలో సీపీఎస్ మరియు పెన్షనర్లకు వారి బకాయిలు ఇన్ స్టాల్‌మెంట్‌లో ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?