రోడ్లపై షికార్లు చేస్తున్న గజరాజు..
దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో అడవుల్లో ఉండే జంతువులన్నీ ఎంచక్కా రోడ్లెక్కెస్తున్నాయి. ఇప్పటికే పలు దేశాల్లో జంతువులు రోడ్లపైకి రావడం చూసిందే. ఓ చోట పార్క్ నుంచి తప్పించుకున్న జిరాఫీని చూస్తే.. మరికొన్ని చోట్ల నెమళ్లు రోడ్లపైకి వచ్చి నృత్యాలు చేస్తున్నాయి. ఇక తాజాగా కేరళలో ఓ గజరాజు ఓ గ్రామంలోకి షికారుకొచ్చింది.రాష్ట్రంలోని మున్నార్‌లోని ఇడుక్కి ప్రాంతంలో ఓ ఏనుగు ఎంటర్ అయ్యింది. గ్రామంలోని రోడ్లపై యథేచ్చగా సంచరిస్తోంది. దీనికి […]

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో అడవుల్లో ఉండే జంతువులన్నీ ఎంచక్కా రోడ్లెక్కెస్తున్నాయి. ఇప్పటికే పలు దేశాల్లో జంతువులు రోడ్లపైకి రావడం చూసిందే. ఓ చోట పార్క్ నుంచి తప్పించుకున్న జిరాఫీని చూస్తే.. మరికొన్ని చోట్ల నెమళ్లు రోడ్లపైకి వచ్చి నృత్యాలు చేస్తున్నాయి. ఇక తాజాగా కేరళలో ఓ గజరాజు ఓ గ్రామంలోకి షికారుకొచ్చింది.రాష్ట్రంలోని మున్నార్‌లోని ఇడుక్కి ప్రాంతంలో ఓ ఏనుగు ఎంటర్ అయ్యింది. గ్రామంలోని రోడ్లపై యథేచ్చగా సంచరిస్తోంది. దీనికి సబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే గజరాజు ఎక్కడ తమపై దాడి చేస్తోందోనన్న భయంతో గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఏనుగు కోసం గాలిస్తున్నారు. అయితే ఆహారం కోసమే ఏనుగు గ్రామంలోకి ప్రవేశించి ఉంటుందని అధికారులు అంటున్నారు.
Kerala: An elephant walks on the empty streets in Munnar amid the #CoronavirusLockdown. (24.04.2020) pic.twitter.com/QZbr7kjzu9
— ANI (@ANI) April 24, 2020