AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఈఫిల్ టవర్’ సందర్శనకు అనుమతి…నిబంధనలు తప్పని సరి

అద్భుతమైన పర్యాటక అనుభవాలను పంచే ప్రపంచ ప్రసిద్ధ ప్రదేశం పారిస్ నగరం. ప్రపంచ దేశాల టూరిస్టులు ఈ నగరాన్ని అత్యధికంగా సందర్శిస్తుంటారు. ఎప్పుడూ పర్యాటకుల తాకిడితో సందడిగా ఉండే ఈ నగరం గత మూడు నెలలుగా జన సంచారం లేక బోసిపోయిన పారిస్ మళ్లీ పర్యాటకులతో రద్దీగా మారుతోంది.

‘ఈఫిల్ టవర్’ సందర్శనకు అనుమతి...నిబంధనలు తప్పని సరి
Jyothi Gadda
|

Updated on: Jun 25, 2020 | 5:15 PM

Share

అద్భుతమైన పర్యాటక అనుభవాలను పంచే ప్రపంచ ప్రసిద్ధ ప్రదేశం పారిస్ నగరం. ప్రపంచ దేశాల టూరిస్టులు ఈ నగరాన్ని అత్యధికంగా సందర్శిస్తుంటారు. ఎప్పుడూ పర్యాటకుల తాకిడితో సందడిగా ఉండే ఈ నగరం గత మూడు నెలలుగా జన సంచారం లేక బోసిపోయిన పారిస్ మళ్లీ పర్యాటకులతో రద్దీగా మారుతోంది. ఫ్రాన్స్‌లో ఉన్న ప్రఖ్యాత ఈఫిల్ టవర్ తెరుచుకున్నది. మూడు నెలల లాక్‌డౌన్ తర్వాత ఈఫిల్ టవర్‌కు మళ్లీ సందర్శకుల తాకిడి మొదలైంది.

పారిస్‌లో ఉన్న టవర్‌ను చూసేందుకు ప్రతి ఏడాది లక్షలాది మంది పర్యాటకులు అక్కడకు వెళ్తుంటారు. నోవెల్ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఫ్రాన్స్ దేశం కూడా లాక్‌డౌన్ అయింది. దీంతో పారిస్‌లోని ఈఫిల్ టవర్ తో సహా అన్ని పర్యాటక ప్రదేశాలు మూతపడ్డాయి. జన జీవనం ఇళ్లకే పరిమితమైంది. కాగా, కరోనా తగ్గుముఖం పట్టడంతో తిరిగి సందర్శకులను అనుమతిస్తున్నారు. అయితే ఇక నుంచి కొన్నాళ్ల పాటు పర్యాటకుల సంఖ్యను తగ్గించనున్నారు. 11 ఏళ్లు దాటిన వారికి ఫేస్‌మాస్క్ తప్పనిసరి. టవర్‌లో రెండవ అంతస్తును మూసివేస్తున్నారు. 1889లో పూర్తి అయిన ఈఫిల్ టవర్ నిర్మాణాన్ని వీక్షించేందుకు ప్రతి ఏడాది 70 లక్షల మంది పర్యాటకులు వస్తుంటారు. అయితే, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఈఫిల్ టవర్‌ను చాలా కాలం మూసివేయడం ఇదే తొలిసారి.

Follow Us
ఉదయాన్నే బార్లీ వాటర్ తాగితే మీ శరీరంలో జరిగేది ఇదే
ఉదయాన్నే బార్లీ వాటర్ తాగితే మీ శరీరంలో జరిగేది ఇదే
భోజనం చేసేటప్పుడు మొబైల్‌ ఫోన్‌ చూస్తూ తినే అలవాటు మీకూ ఉందా?
భోజనం చేసేటప్పుడు మొబైల్‌ ఫోన్‌ చూస్తూ తినే అలవాటు మీకూ ఉందా?
ఆ సినిమా తర్వాత ఆఫర్స్ వస్తాయనుకున్నా.. కానీ
ఆ సినిమా తర్వాత ఆఫర్స్ వస్తాయనుకున్నా.. కానీ
కాబోయే పెళ్లికూతురు ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌ కలకలం..!
కాబోయే పెళ్లికూతురు ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌ కలకలం..!
అద్దెకు ఎలక్ట్రిక్ స్కూటర్లు..హైదరాబాద్‌ సహా ఈ నగరాల్లో ప్రారంభం
అద్దెకు ఎలక్ట్రిక్ స్కూటర్లు..హైదరాబాద్‌ సహా ఈ నగరాల్లో ప్రారంభం
అజీర్ణంతో మనశ్శాంతి కరువైందా? ఇలా చేస్తే చిటికెలో మీ పొట్ట హ్యాపీ
అజీర్ణంతో మనశ్శాంతి కరువైందా? ఇలా చేస్తే చిటికెలో మీ పొట్ట హ్యాపీ
చంద్రగ్రహణం ముగిసింది..! ఇప్పుడు తప్పక చేయాల్సిన పనులు ఇవే..
చంద్రగ్రహణం ముగిసింది..! ఇప్పుడు తప్పక చేయాల్సిన పనులు ఇవే..
చంద్రగ్రహణం రోజున రెండు తలల దూడకు జన్మనిచ్చిన ఆవు.. ఇదిగో వీడియో
చంద్రగ్రహణం రోజున రెండు తలల దూడకు జన్మనిచ్చిన ఆవు.. ఇదిగో వీడియో
మూడేళ్లుగా వాగులో బండరాయిగా వదిలేశారు.. తీరా చూస్తే షాక్!
మూడేళ్లుగా వాగులో బండరాయిగా వదిలేశారు.. తీరా చూస్తే షాక్!
చీపురును ఈ మూలన పెడితే డబ్బే డబ్బు.. లక్ష్మీ కటాక్షం ఉండాలంటే ఇలా
చీపురును ఈ మూలన పెడితే డబ్బే డబ్బు.. లక్ష్మీ కటాక్షం ఉండాలంటే ఇలా