డ్రోన్‌తో మిడతలకు చెక్.. ఎలాగో మీరే చూడండి…

ఒకపక్క దేశం మొత్తం కరోనాతో పోరాడుతుంటే నార్త్ ఇండియా రాష్ట్రాలను మిడతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గత 27ఏళ్లలో ఎప్పుడూలేని పరిస్థితిని భారత్‌ ఎదుర్కొంటోంది...

  • Sanjay Kasula
  • Publish Date - 5:32 am, Wed, 1 July 20
డ్రోన్‌తో మిడతలకు చెక్.. ఎలాగో మీరే చూడండి...

ఒకపక్క దేశం మొత్తం కరోనాతో పోరాడుతుంటే నార్త్ ఇండియా రాష్ట్రాలను మిడతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గత 27ఏళ్లలో ఎప్పుడూలేని పరిస్థితిని భారత్‌ ఎదుర్కొంటోంది. భారీ స్థాయిలో ఎడారి మిడతల దండు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ను కుదిపేస్తోంది. మిడతల దండును అంతం చేయడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. వేల ఎకరాల్లో పంట నాశనం కాకుండా, మిడతలను మట్టుపెట్టడానికి అత్యాధునిక స్ప్రేయర్లు, డ్రోన్‌లను వినియోగిస్తోంది.

అయితే తాజాగా.. మిడతలు ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాపై దండయాత్ర చేస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం మిడతలను అంతమొందించేందుకు కీటక నాశినులను స్ప్రే చేస్తున్నారు. ఇందు కోసం కేంద్రప్రభుత్వం అందించిన నాలుగు డ్రోన్లను అందించింది. డ్రోన్ల సాయంతో మిడతలకు బ్రేక్ వేస్తున్నారు. కెమికల్స్ ను వాటిపై స్ప్రే చేస్తున్నారు. ఇప్పటివరకు 60 శాతం మిడతలను మట్టుకరిపించామని అగ్రికల్చర్ విభాగం అధికారులు తెలిపారు.

 

కెమికల్స్ ను వాటిపై స్ప్రే చేస్తున్నారు. ఇప్పటివరకు 60 శాతం మిడతలను మట్టుకరిపించామని అగ్రికల్చర్ విభాగం అధికారులు తెలిపారు.