సిగ్గు పడాల్సిన అవసరం లేదు.. ధైర్యంగా ఉండండి: నవ్య స్వామి

ఈ విషయంపై నవ్యా స్వామి స్పందిస్తూ.. ఇది సిగ్గుపడాల్సిన, భయ పడాల్సిన విషయం కాదు. ఇతరులు చేసే విమర్శనలను అస్సలు పట్టించుకోకండి. నెగిటివిటీకి దూరంగా ఉండండి. వ్యాధి బారిన పడటం కన్నా ముందు జాగ్రత్తగా ఉండటం మేలు. ఎవరికి వారు స్వీయ నిర్భంధంలో..

  • Updated On - 2:38 pm, Thu, 2 July 20 Edited By:
సిగ్గు పడాల్సిన అవసరం లేదు.. ధైర్యంగా ఉండండి: నవ్య స్వామి

దేశంలో కరోనా వైరస్ విపరీతంగా వ్యాపిస్తోన్న సంగతి తెలిసిందే కదా. దీంతో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని కంటైన్‌మెంట్ జోన్‌లలో జులై 31 వరకూ లాక్‌డౌన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఇక సామాన్యుల నుంచి మంత్రులు, నటులు, ఉద్యోగులు, వైద్యులు కూడా ఈ కరోనా బారిన పడుతున్నారు. బుధవారం ‘నాపేరు మీనాక్షి’, ‘ఆమె కథ’ సీరియల్స్‌లో హీరోయిన్‌గా నటిస్తోన్న నవ్య స్వామికి కరోనా సోకింది. గత కొద్ది రోజులుగా ఆమె స్వల్ప అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. ఈ నేపథ్యంలో ఆమె కరోనా వైరస్ టెస్టుకు వెళ్లగా పాజిటివ్ నిర్థారణ అయింది.

తాజాగా ఈ విషయంపై నవ్య స్వామి స్పందిస్తూ.. ఇది సిగ్గుపడాల్సిన, భయ పడాల్సిన విషయం కాదు. ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. ఇతరులు చేసే విమర్శలను అస్సలు పట్టించుకోకండి. నెగిటివిటీకి దూరంగా ఉండండి. వ్యాధి బారిన పడటం కన్నా ముందు జాగ్రత్తగా ఉండటం మేలు. ఎవరికి వారు స్వీయ నిర్భంధంలో ఉండండి. సోషల్ డిస్టెన్స్ తప్పక పాటించండి. మీ ప్రేమ, అభిమానాల వల్ల ప్రస్తుతం నేను బాగానే ఉన్నా. త్వరలోనే మరింత స్ట్రాంగ్‌గా మీ ముందుకు వస్తా అంటూ వీడియో చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది నవ్య స్వామి.

Read More:

27 అడుగులకే ఖైరతాబాద్ గణేషుడు.. ఈసారి మట్టితో..

విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఫ్రీగా లాప్‌టాప్స్, ఫోన్స్..