AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Cases: దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసులు.. 24 గంటల్లోనే 16 మంది మృత్యువాత..

దేశ రాజధాని న్యూఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 757 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

Corona Cases: దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసులు.. 24 గంటల్లోనే 16 మంది మృత్యువాత..
Shiva Prajapati
|

Updated on: Dec 28, 2020 | 5:30 AM

Share

Corona Cases: దేశ రాజధాని న్యూఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 757 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక ఒక్క రోజులోనే 16 మంది మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం నాడు నమోదైన కేసులతో కలిపి ఇప్పటి వరకు ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 6,22,851 కు చేరింది. ఇక మృతుల సంఖ్ 10,453కి చేరింది. కాగా ఇవాళ ఒక్కరోజు 939 మంది కరోనా బాధితులు పూర్తిగా కోలుకుని ఆస్పత్రుల నుంచి ఇంటికి చేరుకున్నారు. మొత్తంగా చూసుకుంటే 6,05,685 మంది కరోనా జయించి క్షేమంగా ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఢిల్లీలో కరోనా రికవరీ రేటు 97.24 శాతంగా ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో 6,713  యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇదిలాఉండగా, వాతావరణంలో మార్పుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. చలి తీవ్రంగా పెరుగుతోందని, ఫలితంగా కరోనా వ్యాప్తి పెరిగే అవకాశం ఉందన్నారు.

ఇదిలాఉండగా, ఢిల్లీలో ప్రజలకు వ్యాక్సినేషన్ చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఢిల్లీ జనవరి 3వ తేదీ లోపు పోలీసులు తమ వ్యక్తిగత సమాచారాన్ని అప్‌డేట్ చేసుకోవాలంటూ ఆ శాఖ ఉన్నధికారులు ఆదేశించారు. ఆ మేరకు అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారు. కోవిడ్ వ్యాక్సిన్‌కు సంబంధించిన వివరాలను మెసేజ్ ద్వారా తెలియజేస్తారని, ఆ కారణంగా వ్యక్తిగత సమాచారాన్ని అప్‌డేట్ చేసుకోవాలని ఆదేశించినట్లు ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు.

Also read:

2020 Round-up : 2020లో ఈ లోకాన్ని వీడి అభిమానులను శోకసంద్రంలోకి నెట్టిన సినీ తారలు..

అజింక్య రహానే ఆటతీరుపై సీనియర్ల ప్రశంసలు..కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో అలరించాడు అంటూ ట్వీట్

Delhi CMO Tweet:

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!