దేశ రాజధానిలో మళ్లీ పెరుగుతున్న కేసులు
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మొన్నటి వరకు అదుపులోకి వస్తుందని అంతా అనుకుంటే.. గడిచిన 24 గంటల్లో మళ్లీ పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా మరో..
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మొన్నటి వరకు అదుపులోకి వస్తుందని అంతా అనుకుంటే.. గడిచిన 24 గంటల్లో మళ్లీ పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా మరో 1,404 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఢిల్లీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు ఢిల్లీ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,44,127కి చేరింది. వీటిలో కరోనా నుంచి కోలుకుని 1,29,362 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఢిల్లీ వ్యాప్తంగా 10,667 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, ఇప్పటి వరకు ఢిల్లీ వ్యాప్తంగా కరోనా బారినపడి 4,098 మంది మరణించారు.
మరోవైపు శనివారం నాడు ఢిల్లీ వ్యాప్తంగా 5,500 ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించగా.. 19,092 ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు నిర్వహించారు. దీంతో ఇప్పటి వరకు ఢిల్లీ వ్యాప్తంగా 11,68,295 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.
5500 RTPCR/CBNAAT/TrueNat tests and 19092 Rapid antigen tests conducted today. So far 1168295 tests have been conducted: Delhi Health Department https://t.co/Kkn3Uwvbyk
— ANI (@ANI) August 8, 2020
Read More :