AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డార్క్ చాక్లెట్‌తో కరోనాకు చెక్ పెట్టొచ్చు.! తాజా పరిశోధనల్లో సంచలన విషయాలు వెల్లడి..

డార్క్ చాక్లెట్స్, గ్రీన్ టీ, మస్కాడిన్ ద్రాక్షలతో సహా పలు ఆహార పానీయాల్లో ఉండే రసాయన సమ్మేళనాల ద్వారా కరోనాకు కారణమైన SARS-CoV-2లోని...

డార్క్ చాక్లెట్‌తో కరోనాకు చెక్ పెట్టొచ్చు.! తాజా పరిశోధనల్లో సంచలన విషయాలు వెల్లడి..
Ravi Kiran
|

Updated on: Dec 03, 2020 | 7:05 PM

Share

Dark Chocolate to Fight COVID-19: కరోనా వైరస్ మనిషి జీవితాన్ని తలక్రిందులు చేసింది. ఈ మహమ్మారి కారణంగా లక్షల్లో ప్రజలు మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దీనిని కట్టడి చేసే విరుగుడు కోసం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నారు. పలు వ్యాక్సిన్లు కూడా క్లినికల్ ట్రయిల్స్ చివరి దశలో ఉన్నాయి. అయితే ఇవే కాకుండా ఇతర విధానాల్లో కూడా వైరస్‌ను నివారించేందుకు సైంటిస్టులు తమ అన్వేషణను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే డార్క్ చాక్లెట్స్, గ్రీన్ టీ, మస్కాడిన్ ద్రాక్షలతో సహా పలు ఆహార పానీయాల్లో ఉండే రసాయన సమ్మేళనాల ద్వారా కరోనాకు కారణమైన SARS-CoV-2లోని ఒక నిర్దిష్ట ఎంజైమ్ లేదా ప్రోటీజ్ పనితీరును నిరోధించవచ్చుని పరిశోధకులు తాజాగా ఓ కీలక అధ్యయనంలో కనుగొన్నారు.

వైరస్ కణాల ఆరోగ్యం, సాధ్యతకు ఎంజైమ్‌లు చాలా కీలకమని.. ఒకవేళ వాటి పనితీరును నిరోధించగలిగితే.. అవి ప్రతిరూపణతో సహా అనేక ముఖ్యమైన విధులను నిర్వహించలేవని అమెరికాలోని నార్త్ కరోలినా స్టేట్ యూనివర్శిటీ పరిశోధకులు తెలిపారు. ఇలా ఆహార పానీయాల్లో ఉండే రసాయన సమ్మేళనాల ద్వారా వైరస్‌కు కారణమైన ఎంజైమ్ పనితీరును నిరోధించవచ్చునని.. ముఖ్యంగా డార్క్ చాక్లెట్స్, గ్రీన్ టీ, మస్కడిన్ ద్రాక్షలలోని కెమికల్ కాంపౌండ్‌లు వాటిని నిరోధిస్తాయని గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. మానవ కణాల్లో వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ఆహార, ఔషధ మొక్కలలోని న్యూట్రాస్యూటికల్స్‌ను తెలుసుకోవడమే లక్ష్యంగా తమ పరిశోధన కొనసాగుతోందని ప్రొఫెసర్ డే-యూ-షీ పేర్కొన్నారు.

వివిధ ఆహార, మొక్కల రసాయన సమ్మేళనాలను ఎదుర్కొన్నప్పుడు SARS-CoV-2 వైరస్‌లోని ప్రధాన ఎంజైమ్ ఏవిధంగా స్పందిస్తుందో తెలుసుకునేందుకు పరిశోధకులు కంప్యూటర్ సిమ్యులేషన్స్, ల్యాబ్ స్టడీస్ రెండింటిని విశ్లేషించారు. వైరస్ విచ్ఛిన్నం కావడానికి.. తిరిగి సమీకరించటానికి SARS-CoV-2లోని MPRO అవసరం అవుతుందని ప్రొఫెసర్ డే-యూ-షీ తెలిపారు. వీటిని డార్క్ చాక్లెట్స్, గ్రీన్ టీ, మస్కాడిన్ ద్రాక్షలలోని రసాయన సమ్మేళనాలతో నింపినప్పుడు ప్రధాన ఎంజైమ్ పనితీరును నిరోధించడంలో విజయవంతం అవుతామని.. తద్వారా వైరస్ చనిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తాజాగా దీనికి సంబంధించిన అధ్యయనాన్ని ఫ్రాంటియర్స్ ఇన్‌ప్లాంట్ సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు. ఈ అధ్యయనానికి అమెరికా వ్యవసాయ శాఖకు కూడా మద్దతు తెలిపింది.