పాక్‌పై పంజా విసిరిన కరోనా.. ఒక్కరోజులోనే..
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా.. పాకిస్థాన్‌పై పంజా విసిరింది. ఇప్పటికే యూరప్ దేశాల్లో ఈ వైరస్ మరణ మృదంగాన్ని మోగిస్తోంది. చైనా తర్వాత ఇటలీలో దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఇక మనదేశంలో కూడా ఇది ప్రభలుతోంది. ఇప్పటికే కరోనా బారినపడి ఇద్దరు వ్యక్తులు మరణించగా.. 114 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే మన పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. ఆదివారం వరకు పాక్‌లో కేవలం 50 కేసులు మాత్రమే […]
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా.. పాకిస్థాన్‌పై పంజా విసిరింది. ఇప్పటికే యూరప్ దేశాల్లో ఈ వైరస్ మరణ మృదంగాన్ని మోగిస్తోంది. చైనా తర్వాత ఇటలీలో దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఇక మనదేశంలో కూడా ఇది ప్రభలుతోంది. ఇప్పటికే కరోనా బారినపడి ఇద్దరు వ్యక్తులు మరణించగా.. 114 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే మన పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. ఆదివారం వరకు పాక్‌లో కేవలం 50 కేసులు మాత్రమే పాజిటివ్‌గా తేలాయి. అయితే ఉన్నట్టుండి ఒక్క సోమవారం రోజే 131 కేసులు కరోనా పాజిటివ్‌గా తేలాయి. దీంతో పాకిస్థాన్‌లో మొత్తం 180కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో పాక్ ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. కాగా.. ఇప్పటకే 162 దేశాలకు ఈ కరోనా మహమ్మారి వ్యాపించింది. కరోనా సోకడంతో.. ఏడువేల మందికి పైగా మరణించగా.. దాదాపు రెండు లక్షల మంది వరకు ఆస్పత్రి పాలయ్యారు.
Pakistan’s tally of #COVID19 positive cases balloons to 186, a sharp rise of 131 cases in 24 hours: Pakistani Media pic.twitter.com/Tqea6dlGYz
— ANI (@ANI) March 16, 2020