AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా ఎఫెక్ట్: ఏ దేశం తీసుకోని సంచలన నిర్ణయం తీసుకున్న స్పెయిన్..!

కరోనా ప్రభావం రోజురోజుకు ఎక్కువవుతోంది. చైనా తరువాత యూరప్ దేశాల్లో ఈ వైరస్ తన ప్రభావాన్ని అధికంగా చూపుతోంది. అక్కడి వాతావరణ చల్లగా ఉండటంతో.. వైరస్ కంట్రోల్ అవ్వడం లేదు.

కరోనా ఎఫెక్ట్: ఏ దేశం తీసుకోని సంచలన నిర్ణయం తీసుకున్న స్పెయిన్..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 17, 2020 | 9:50 AM

Share

కరోనా ప్రభావం రోజురోజుకు ఎక్కువవుతోంది. చైనా తరువాత యూరప్ దేశాల్లో ఈ వైరస్ తన ప్రభావాన్ని అధికంగా చూపుతోంది. అక్కడి వాతావరణ చల్లగా ఉండటంతో.. వైరస్ కంట్రోల్ అవ్వడం లేదు. అయితే ఈ మహమ్మారిని ఎలాగైనా కట్టడి చేయాలని యూరప్ దేశం స్పెయిన్ నడుం బిగించింది. ఈ నేపథ్యంలో ఇంతవరకు ఏ దేశం తీసుకోని సంచలన నిర్ణయం తీసుకుంది. స్పెయిన్‌లో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలన్నింటిని జాతీయం చేసింది. దీంతో ఆ దేశంలో అన్ని ఆసుపత్రులు ప్రభుత్వ ఆసుపత్రుల్లాగా పనిచేయనున్నాయి. అంతేకాదు కరోనా బాధితులు ఇప్పుడు స్పెయిన్‌లోని ఏ ఆస్పత్రికి వెళ్లినా ఖర్చులన్నీ ఫ్రీ. ఈ చర్య వలన కరోనా బాధితుల నుంచీ ప్రైవేట్ ఆస్పత్రులు అడ్డగోలుగా ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉండదు. ఇక ఈ నిర్ణయాన్ని ఆ దేశ ప్రజలు స్వాగతిస్తున్నారు.

కాగా మంగళవారానికి స్పెయిన్‌లో కరోనా బాధితుల సంఖ్య 9,942కు చేరింది. 342మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో గత వారమే స్పెయిన్ నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. అన్ని స్కూళ్లు, పబ్లిక్ ప్రదేశాలు, పార్కులు, మాళ్లు, థియేటర్లూ మూసేసింది. అత్యవసరమైతే తప్ప ఇళ్లలోంచీ బయటకు రావొద్దని ప్రజలకు చెప్పింది. రాజధాని మాడ్రిడ్‌లో సూపర్ మార్కెట్లు, ఫార్మసీలు (మెడికల్ షాపులు) తప్ప అన్నీ మూతపడ్డాయి. అధికారులు డ్రోన్ల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఇలాంటి బాధాకరమైన పరిస్థితుల్లో ప్రజల్లో ధైర్యాన్ని నింపుతూ ఆ దేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిజంగా ప్రశంసించదగ్గ విషయమే. కాగా స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ భార్య బెగోనా సాంచెజ్ కి కూడా  కోవిడ్-19 సోకిన విషయం తెలిసిందే. Read This Story Also: పదో తరగతి పరీక్షలు.. టీఎస్ సర్కార్ మరో కీలక నిర్ణయం

Follow Us
బుమ్రా, సూర్యకుమార్‌లపై వేటు? హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం..!
బుమ్రా, సూర్యకుమార్‌లపై వేటు? హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం..!
నీట్‌ యూజీ 2026 పరీక్ష రూల్స్ ఇవే.. ఈ తప్పులు చేస్తే మీకే నష్టం!
నీట్‌ యూజీ 2026 పరీక్ష రూల్స్ ఇవే.. ఈ తప్పులు చేస్తే మీకే నష్టం!
వెండి కొంటున్నారా? జాగ్రత్త! ప్రతి ముగ్గురిలో ఒకరు మోసపోతున్నారట
వెండి కొంటున్నారా? జాగ్రత్త! ప్రతి ముగ్గురిలో ఒకరు మోసపోతున్నారట
భార్యను తిట్టిన భర్త.. తననే దూషించారనుకొని పక్కింటి మహిళ దాడి!
భార్యను తిట్టిన భర్త.. తననే దూషించారనుకొని పక్కింటి మహిళ దాడి!
ఈ నెలాఖరులోగా పదో ఫలితాలు 2026 విడుదల.. తాజా అప్ డేట్
ఈ నెలాఖరులోగా పదో ఫలితాలు 2026 విడుదల.. తాజా అప్ డేట్
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? తులం ధర ఎంత?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? తులం ధర ఎంత?
CBSE రెండో విడత 2026 పరీక్షలు.. ఆ సబ్జెక్టుకే అత్యధిక దరఖాస్తులు!
CBSE రెండో విడత 2026 పరీక్షలు.. ఆ సబ్జెక్టుకే అత్యధిక దరఖాస్తులు!
రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆదాయం, ఉద్యోగం, శుభవార్తల జోరు!
రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆదాయం, ఉద్యోగం, శుభవార్తల జోరు!
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు