Vaccinate All: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం.. సవాలుగా మారిన వ్యాక్సినేషన్

Vaccination All - Covid-19 India Second Wave: భారత్‌లో కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం నాలుగు లక్షల కోవిడ్ కేసులు, నాలుగువేలకు పైగా మరణాలు

Vaccinate All: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం.. సవాలుగా మారిన వ్యాక్సినేషన్
Coronavirus
Follow us

|

Updated on: May 11, 2021 | 11:27 AM

Vaccination All – Covid-19 India Second Wave: భారత్‌లో కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం నాలుగు లక్షల కోవిడ్ కేసులు, నాలుగువేలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. ఈ తరుణంలో అంతటా ఆందోళన నెలకొంది. ప్రపంచంలో కరోనా ప్రారంభం నాటినుంచి మహమ్మారిని అరికట్టేందుకు వ్యాక్సిన్లను అత్యంత వేగంగా అభివృద్ధి చేశారు. కానీ ఆ రకంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ మాత్రం కొనసాగడం లేదు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 250 వ్యాక్సిన్లకు పరిశోధనలు చేయగా.. అత్యవసర ఉపయోగం కోసం కేవలం 10 వ్యాక్సిన్లు మాత్రమే ఆమోదం పొందాయి. వీటిలో ఫైజర్-బయోఎంటెక్, మోడరోనా, ఆస్ట్రా జెనెకా – ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ కోవిషీల్డ్, స్పుత్నిక్ వీ, చైనా కాన్సినో బయోలాజిక్స్, భారత్ బయోటెక్ కోవ్యాక్సిన్, జాన్సన్ అండ్ జాన్సన్, సినోవాక్ సినోఫార్మ్ టీకాలు ఉన్నాయి. తీవ్రమైన వ్యాధి, మృత్యువు నుంచి రక్షించడంలో ఇవన్నీ సురక్షితమైనవిగా.. సమర్థవంతమైనవగా క్లినికల్స్ ట్రయల్స్‌లో వెల్లడైంది. ఈ కరోనా వ్యాక్సిన్‌ను రెండు విడతల్లో ఇస్తారు. ఒక్క జాన్సన్ అండ్ జాన్సన్ మాత్రమే సింగిల్ డోస్ ఇస్తున్నారు. ఇంకా మరికొన్ని వ్యాక్సిన్లు ఆమోదదశలో ఉన్నాయి.

అయితే.. ఇదంతా ఒక ఎత్తయితే.. వ్యాక్సినేషన్ ప్రక్రియ మరొక క్లిష్టంగా మారింది. కరోనా మహమ్మారి ప్రారంభమై దాదాపు ఏడాదిన్నర కావొస్తోంది. చాలా వ్యాక్సిన్లు ఆమోదం పొందాయి. అయినా ఈ మహమ్మారిని అరికట్టేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగకపోవడం ఆందోళనకరంగా మారింది. భారత్‌లో ఇప్పటికే రెండు వ్యాక్సిన్లు ఆమోదం పొందాయి. మరో వ్యాక్సిన్‌కు ఇటీవలనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ప్రపంచంలోనే అత్యధికంగా ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ సవాలుగా మారిందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. వైరస్ నియంత్రణకు వ్యాక్సినేషనే ప్రధాన మార్గం అని అందరూ పేర్కొంటున్న సమయంలో.. భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా కొనసాగడంపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కొన్ని దేశాల్లో వ్యాక్సిన్ ప్రక్రియ దాదాపు 60 శాతం వరకు పూర్తికావొస్తోంది. చాలా దేశాల్లో వ్యాక్సినేషన్ 5 శాతం కూడా పూర్తి కాలేదు. అయితే.. మనదేశంలో నాలుగు నెలలు కావొస్తున్నా.. 6-7 శాతం మాత్రమే పూర్తయింది.

మొదటి డోస్ తీసుకున్నా.. రెండో డోస్ కోసం చాలా సమయం పడుతోంది. వాస్తవానికి మొదటి డోస్ తీసుకున్న 28 రోజులకు రెండో డోసు కూడా తీసుకోవాలి. కానీ దేశంలో వ్యాక్సిన్లు తగినంత సరఫరా లేకపోవడంతో పలు చోట్ల వ్యాక్సినేషన్ ప్రక్రియను నిలిపివేస్తున్నారు. ఇది కూడా భారత్‌లో కరోనా కేసులు, మరణాలు పెరిగేలా ప్రభావితం అవుతుందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న ఈ తరుణంలో రోగనిరోధక శక్తి, యాంటీబాడీల కోసం వ్యాక్సినేషన్ తప్పనిసరిగా వేగంగా జరగాలని పేర్కొంటున్నారు. అయితే.. వ్యాక్సినేషన్‌లో అమెరికా తరువాత చైనా, భారతదేశం మూడవ స్థానంలో ఉంది. అయితే.. భారత జనాభాలో కేవలం 13% మందికి ఒకే డోస్ లభించింది, కేవలం 2% శాతం మందికే పూర్తిగా టీకా వేశారు.

టీకా తయారీ, ఉత్పత్తి కేంద్రంగా ఉన్న భారతదేశంలో రెండు డోసులు వేయడం ఎందుకు కష్టంగా మారిందని ప్రశ్నిస్తున్నారు. దీనికి సరైన ప్రభుత్వ ప్రణాళిక లేకపోవడమా..? నిధులను పెంచకపోవడమా..? ఒకవేళ టీకా ఉత్పత్తి కంపెనీల బాధ్యతారాహిత్యమా అనే సందేహాలను పలువురు వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా ఉత్పత్తిని పెంచి.. తగినన్ని నిధులను కేటాయిస్తే జనాభా మొత్తానికి 2-3 నెలల్లో వ్యాక్సిన్ వేయవచ్చని పేర్కొంటున్నారు.

ఇప్పుడున్న కరోనా విపత్కర పరిస్థితుల్లో వ్యాక్సినేషనే ఆయుధమని వైద్య నిపుణులు పేర్కొంటున్న తరుణంలో టీవీ9 మరో మంచి పనికి నడుంబిగించింది. అందరికీ వ్యాక్సిన్ అందాలనే సంకల్పంతో ముమ్మర ప్రచారాన్ని ప్రారంభించింది. మహమ్మరిని నియంత్రించేందుకు ఇప్పుడే అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని కోరుతుంది. మీరు కూడా వ్యాక్సిన్ తీసుకోకపోతే.. నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా కోవిన్ యాప్‌లో నమోదు చేసుకోండి.. త్వరగా వ్యాక్సిన్ తీసుకోండి. మీకోసం మీ కుటుంబం ఉందన్న విషయాన్ని మరువకండి.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉందాం కరోనాను నియంత్రిద్దాం..

Also Read:

ఇండియాలో వ్యాక్సిన్ కొరతకు సవాలక్ష కారణాలు, తప్పెవరిది ? ప్రభుత్వానిదా ? ఉత్పత్తిదారులదా ?

Tamil Nadu Covid help: రూ.2 వేల ఆర్థిక సాయం పంపిణీకి సీఎం స్టాలిన్ శ్రీకారం.. నగదు పంపిణీలో వృద్ధులకు తొలి ప్రాధాన్యత