గుడ్ న్యూస్.. “కరోనా” టీకా తయారు చేసిన మన హైదరాబాదీ ప్రొఫెసర్..!
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి గురించి తెలిసిందే. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఇది 28 వేల మందికిపైగా ప్రాణాలను మింగేసింది మరో ఆరు లక్షల మందికి పైగా దీని బారినపడి ఆస్పత్రి పాలయ్యారు. అయితే చైనాలో పుట్టిన ఈ వైరస్.. మెల్లిగా ప్రపంచ దేశాలన్నింటిని టచ్ చేసింది. అయితే దీనికి ఇప్పటికీ వ్యాక్సిన్ లేకపోవడంతో.. ప్రపంచ దేశాలన్నీ.. దీని పేరు చెప్తే గజగజవణికిపోతున్నాయి. అయితే ఇప్పటికే చైనా దీనికి వ్యాక్సిన్ కనుక్కొని ఉండొచ్చని.. ఈ వైరస్‌ను చైనానే […]

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి గురించి తెలిసిందే. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఇది 28 వేల మందికిపైగా ప్రాణాలను మింగేసింది మరో ఆరు లక్షల మందికి పైగా దీని బారినపడి ఆస్పత్రి పాలయ్యారు. అయితే చైనాలో పుట్టిన ఈ వైరస్.. మెల్లిగా ప్రపంచ దేశాలన్నింటిని టచ్ చేసింది. అయితే దీనికి ఇప్పటికీ వ్యాక్సిన్ లేకపోవడంతో.. ప్రపంచ దేశాలన్నీ.. దీని పేరు చెప్తే గజగజవణికిపోతున్నాయి. అయితే ఇప్పటికే చైనా దీనికి వ్యాక్సిన్ కనుక్కొని ఉండొచ్చని.. ఈ వైరస్‌ను చైనానే కావాలని సృష్టించి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ మొత్తానికి తాజాగా గత మూడు నాలుగు రోజుల క్రితమే క్లినికల్ ట్రయల్ చేసినట్లు అక్కడి పత్రికలు వెల్లడించాయి.
అయితే ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రోఫెసర్ అందరికీ ఊరటకల్పించే ఓ విషయాన్ని చెప్పారు. హైదరాబాద్ యూనివర్సిటీకి చెందిన ప్రోఫెసర్ శీమా మిశ్రా కరోనాను ఎదుర్కొనే ఓ పొటెన్షియల్ వ్యాక్సిన్‌ను తయారు చేశారు. కరోనా వైరస్ నిర్మాణ, నిర్మాణేతర ప్రోటీన్లను ఈ టీకా అడ్డుకుంటుందని పేర్కొన్నారు. అయితే దీనిని ఇప్పుడు టెస్టింగ్ కోసం పంపిచినట్లు తెలిపారు.ఈ టీకా ద్వారా.. శరీరంలోని ఇమ్యూనిటీ పవర్‌ను పెంచడంతో పాటుగా..శరీరంలో ఉన్న కరోనా వైరస్ కణాలను నాశనం చేస్తుందన్నారు. మొత్తానికి మన దేశం కూడా కరోనా వ్యాక్సిన్ కనిపెట్టే దిశగా ప్రపంచ దేశాలతో పోటీ పడుతుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. కరోనాతో ఇబ్బందులు పడుతున్న చైనాకి, ఇటలీకి.. మనదేశం నుంచి వారికి కావాల్సిన వైద్య పరికరాలను పంపించిన విషయం తెలిసిందే.
Research on potential vaccine against all the structural and non-structural proteins of novel coronavirus-2 (2019-nCoV) for experimental testing at @HydUniv
Read more at:https://t.co/bBXKhO1BJH pic.twitter.com/lbcCrsGX3V
— Univ of Hyderabad (@HydUniv) March 27, 2020



