షాకింగ్ న్యూస్..ఏపీలో ఒకేరోజు 6 కరోనా పాజిటివ్ కేసులు..మొత్తం 19
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ మహమ్మారి చెలరేగిపోతుంది. శనివారం ఒక్కరోజే ఏపీలో 6 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైద్య ఆరోగ్యశాఖ రిలీజ్ చేసిన తాజా బులెటిన్‌లో ఈ విషయం వెల్లడించింది. గుంటూరు, కృష్ణ, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19కి చేరింది. గుంటూరులో ఒకే ఫ్యామిలీలో నలుగురికి కరోనా సోకింది. వీరిలో ఇద్దరికి ఇంతకు ముందే నిర్ధారణ కాగా.. మరో ఇద్దరికి కూడా తాజా రిపోర్ట్స్ […]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ మహమ్మారి చెలరేగిపోతుంది. శనివారం ఒక్కరోజే ఏపీలో 6 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైద్య ఆరోగ్యశాఖ రిలీజ్ చేసిన తాజా బులెటిన్‌లో ఈ విషయం వెల్లడించింది. గుంటూరు, కృష్ణ, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19కి చేరింది.
గుంటూరులో ఒకే ఫ్యామిలీలో నలుగురికి కరోనా సోకింది. వీరిలో ఇద్దరికి ఇంతకు ముందే నిర్ధారణ కాగా.. మరో ఇద్దరికి కూడా తాజా రిపోర్ట్స్ లో పాజిటివ్ అని తేలింది. వీరిందర్నీ క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో భార్యాభర్తలిద్దరికీ కోవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. నవాబుపేటకు చెందిన వ్యక్తి ఢిల్లీ టూర్ కు వెళ్లిరాగా.. ఆయనతోపాటు, ఆయన భార్యలోనూ కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో వెంటనే వారిని ఒంగోలు రిమ్స్‌కు తరలించిన క్వారంటైన్లో ఉంచారు. కర్నూలు జిల్లాలో రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకింది. విజయవాడకు చెందిన ఓ వ్యక్తికి కూడా కరోనా బారిన పడ్డట్లు నిర్దారించారు. 65 ఏళ్ల వయసున్న ఈయన మార్చి 10 తేదీన మక్కా నుంచి హైదరాబాద్ మీదుగా విజయవాడ వచ్చారు.




