AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking: తెలంగాణలో కరోనాతో ఆరుగురు మృతి..

Coronavirus Updates: తెలంగాణలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా ఈ మహమ్మారి బారిన పడి ఆరుగురు మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులిటెన్ విడుదల చేసింది. ఈ నెల 13 నుంచి 15 వరకు ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ లో మత పరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి కరోనా వైరస్ సోకింది. అందులో తెలంగాణకు చెందిన వారు కూడా ఉన్నారు. వారిలో ఇప్పటి వరకు […]

Breaking: తెలంగాణలో కరోనాతో ఆరుగురు మృతి..
Ravi Kiran
|

Updated on: Mar 31, 2020 | 5:35 PM

Share

Coronavirus Updates: తెలంగాణలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా ఈ మహమ్మారి బారిన పడి ఆరుగురు మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులిటెన్ విడుదల చేసింది. ఈ నెల 13 నుంచి 15 వరకు ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ లో మత పరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి కరోనా వైరస్ సోకింది. అందులో తెలంగాణకు చెందిన వారు కూడా ఉన్నారు. వారిలో ఇప్పటి వరకు ఆరుగురు మరణించారు. ఇద్దరు గాంధి ఆసుపత్రిలో, ఒకరు అపోలో ఆసుపత్రిలో, ఒకరు గ్లోబల్ ఆసుపత్రిలో, ఒకరు నిజామాబాద్ లో, ఒకరు గద్వాలలో మరణించారు.

వీరి ద్వారా వైరస్ సోకే అవకాశం ఉందని భావిస్తున్న అనుమానితులను ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు గుర్తించి, ఆసుపత్రులకు తరలిస్తున్నాయి. వారికి పరీక్షలు నిర్వహించి, వైద్యం అందిస్తున్నారు. మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారికి కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తున్నది కాబట్టి, ఈ ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరు విధిగా తమ సమాచారాన్ని అధికారులకు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది. వారికి ప్రభుత్వమే పరీక్షలు నిర్వహించి, ఉచితంగా చికిత్స కూడా అందిస్తుంది. కాబట్టి మర్కజ్ వెళ్ళి వచ్చిన వారంతా తప్పక అధికారులకు సమాచారం అందించాలి. వారి గురించి ఎవరికి సమాచారం తెలిసినా వెంటనే ప్రభుత్వానికి తెలియజేయాలని వైద్య ఆరోగ్య శాఖ కోరింది. కాగా, ఇవాళ కరోనా కారణంగా ఆరుగురు మృతి చెందటంతో తెలంగాణలో మృతుల సంఖ్య 7కు చేరింది.

మరోవైపు దేశంలో ఒక్కరోజే 227 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వాటిల్లో అత్యధికం నిజాముద్దీన్ తబ్లిఘి- జమాత్ కారణంగా వ్యాప్తి చెందినవే అని తెలుస్తోంది. అటు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1251కు చేరుకుంది.

ఇవి చదవండి:

దేశంలో తొలి కరోనా టెస్టింగ్ కిట్ వెనుకున్న ఆ మహిళ ఎవరంటే…

గుడ్ న్యూస్.. ఏపీలో కోలుకున్న మరో కరోనా బాధితుడు..

కరోనాపై పద్నాలుగేళ్ల కుర్రాడు ఏడు నెలల క్రితం ఏమన్నాడంటే.?

Follow Us
ఆ సినిమా నేను వినుంటే వద్దనేవాడిని.. సూపర్ స్టార్ కృష్ణ..
ఆ సినిమా నేను వినుంటే వద్దనేవాడిని.. సూపర్ స్టార్ కృష్ణ..
ఆ ప్రభుత్వ బడిలో సీటు దొరకడం అంత ఈజీ కాదు! సీటు కోసం భారీ పోటీ
ఆ ప్రభుత్వ బడిలో సీటు దొరకడం అంత ఈజీ కాదు! సీటు కోసం భారీ పోటీ
72 గంటల్లో ఆ ప్రాంతాలకు రుతుపవనాల విస్తరణ..
72 గంటల్లో ఆ ప్రాంతాలకు రుతుపవనాల విస్తరణ..
మటన్ బిర్యానీ సగం తిన్నాక షాకింగ్ సీన్.. కస్టమర్‌కు భారీ పరిహారం
మటన్ బిర్యానీ సగం తిన్నాక షాకింగ్ సీన్.. కస్టమర్‌కు భారీ పరిహారం
824కు పెరగనున్న లోక్‌సభ ఎంపీ స్థానాలు!
824కు పెరగనున్న లోక్‌సభ ఎంపీ స్థానాలు!
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభానికి డేట్ ఫిక్స్
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభానికి డేట్ ఫిక్స్
ఏసీ వాడకంలో ఈ ఒక్క ట్రిక్ తెలిస్తే.. కరెంటు బిల్లు సగం తగ్గుతుంది
ఏసీ వాడకంలో ఈ ఒక్క ట్రిక్ తెలిస్తే.. కరెంటు బిల్లు సగం తగ్గుతుంది
వరుస వివాదాలతో సంచలనం.. బిగ్‌బాస్‌ 10లోకి కాంట్రవర్సీ సింగర్ !
వరుస వివాదాలతో సంచలనం.. బిగ్‌బాస్‌ 10లోకి కాంట్రవర్సీ సింగర్ !
తెలంగాణకు బిగ్ అలర్ట్.. 3 రోజులపాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు
తెలంగాణకు బిగ్ అలర్ట్.. 3 రోజులపాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు
అఫ్గాన్ సిరీస్‌కి ఓకే.. వన్డే ప్రపంచకప్‌‌కి ఈ ముగ్గురు నాట్ ఓకే..
అఫ్గాన్ సిరీస్‌కి ఓకే.. వన్డే ప్రపంచకప్‌‌కి ఈ ముగ్గురు నాట్ ఓకే..