వరల్డ్ అప్డేట్: కరోనా పాజిటివ్ కేసులు @ 80 లక్షలు..

ప్రపంచదేశాలలో కరోనా వైరస్ మహమ్మారి మరణ మృదంగం వాయిస్తోంది. ఇప్పటికే అన్ని దేశాలూ వివిధ దశల్లో లాక్ డౌన్ ప్రకటిస్తున్నప్పటికీ.. దీనికి అడ్డుకట్ట వేయడంలో మాత్రం విఫలమవుతూనే వస్తున్నాయి. ఇప్పటివరకు ఈ వైరస్ 213 దేశాలకు పాకింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 8,058,718 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 436,996 మంది మృత్యువాతపడ్డారు. ఇదిలా ఉంటే 4,164,540 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో […]

వరల్డ్ అప్డేట్: కరోనా పాజిటివ్ కేసులు @ 80 లక్షలు..
Ravi Kiran

|

Jun 15, 2020 | 11:00 PM

ప్రపంచదేశాలలో కరోనా వైరస్ మహమ్మారి మరణ మృదంగం వాయిస్తోంది. ఇప్పటికే అన్ని దేశాలూ వివిధ దశల్లో లాక్ డౌన్ ప్రకటిస్తున్నప్పటికీ.. దీనికి అడ్డుకట్ట వేయడంలో మాత్రం విఫలమవుతూనే వస్తున్నాయి. ఇప్పటివరకు ఈ వైరస్ 213 దేశాలకు పాకింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 8,058,718 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 436,996 మంది మృత్యువాతపడ్డారు. ఇదిలా ఉంటే 4,164,540 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో ప్రపంచంలో ఏకంగా 1,23,118 కేసులు, 3,263 మరణాలు సంభవించాయి. దీనితోనే వైరస్ తీవ్రత ఏమేరకు ఉందో అంచనా వేయొచ్చు.

అమెరికా, బ్రెజిల్, స్పెయిన్, ఇటలీ, బ్రిటన్, రష్యా దేశాల్లో కరోనా తీవ్రతరంగా ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో అత్యధిక కేసులు(2,170,722), మరణాలు(117,959) సంభవించాయి. అటు బ్రెజిల్ లో పాజిటివ్ కేసులు 873,963 నమోదు కాగా, మృతుల సంఖ్య 43,485కు చేరింది. ఇక రష్యాలో 537,210 పాజిటివ్ కేసులు, 7,091 మరణాలు నమోదయ్యాయి. భారత్‌లో కరోనా కేసులు 342,291 నమోదు కాగా, మృతుల సంఖ్య 9,884కి చేరింది. కాగా, గత వారం రోజులుగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతూ వస్తుండటంతో భారత్ ప్రపంచంలోని కరోనా తీవ్రంగా ఉన్న దేశాల లిస్టులో నాలుగో స్థానానికి చేరుకుంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu