కరోనా సహాయనిధి.. విరాళాలు ఇచ్చే వారికి గుడ్‌న్యూస్..!
కరోనా వ్యాప్తి నివారణకు ఇటు కేంద్ర, అటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే దేశం మొత్తం లాక్‌డౌన్ ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ.
కరోనా వ్యాప్తి నివారణకు ఇటు కేంద్ర, అటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే దేశం మొత్తం లాక్‌డౌన్ ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లాక్‌డౌన్‌ను కఠినంగా తీసుకోవడంతో పాటు.. ఆదేశాలను బేఖాతరు చేసిన వారిని శిక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే కరోనాపై దేశ, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తోన్న యుద్ధానికి తమ వంతు సహకారం అందించేందుకు పలువురు ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులు తమకు తోచినంత విరాళాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తున్నారు. కాగా కరోనా సహాయనిధికి విరాళాలు ఇచ్చే వారికి ఓ గుడ్‌న్యూస్. అదేంటంటే ప్రధాని రిలీఫ్ ఫండ్, సీఎంల రిలీఫ్ ఫండ్‌లకు ఇచ్చే విరాళాలపై 100శాతం పన్ను మినహాయింపు ఉంటుంది. 1961 ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80జీ కింద ఈ మినహాయింపు వర్తించనుంది. కాగా తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌లకు విరాళాలు కొనసాగుతున్నాయి. సినీ సెలబ్రిటీలైన పవన్ కల్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, లాంటి స్టార్ హీరోలు సహా పలువురు భారీ విరాళాలను ప్రకటించిన విషయం తెలిసిందే.
Read This Story Also: చెర్రీ అదే రోజు ఎందుకు పుట్టాడో తెలిశాక..: చిరు ఇంట్రస్టింగ్ విషెస్