బ్రిటన్ ప్రభుత్వానికి భారత సంతతి డాక్టర్ల వేడుకోలు!

కోవిద్-19 ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. యావత్ బ్రిటన్ ప్రస్తుతం కరోనా కింద పడి నలిగిపోతోంది. వ్యాధి సోకిన వారిని కాపాడేందుకు అక్కడి డాక్టర్లు నిరంతరం కష్టపడుతున్నారు. భారత సంతతి చెందిన

బ్రిటన్ ప్రభుత్వానికి భారత సంతతి డాక్టర్ల వేడుకోలు!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 26, 2020 | 9:45 PM

కోవిద్-19 ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. యావత్ బ్రిటన్ ప్రస్తుతం కరోనా కింద పడి నలిగిపోతోంది. వ్యాధి సోకిన వారిని కాపాడేందుకు అక్కడి డాక్టర్లు నిరంతరం కష్టపడుతున్నారు. భారత సంతతి చెందిన డాక్టర్లు కూడా దేశాన్ని కరోనా పిడికిలి నుంచి విడిపించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇలా అందరితో సమానంగా కష్ట పడుతున్నా కూడా తమపై ఇమిగ్రేషన్ హెల్త్ సర్‌చార్జ్ విధించడాన్ని వారు ఆక్షేపిస్తున్నారు. ఇలాంటి సమయాల్లోనూ సర్ చార్జ్ విధించడమనేది అన్యాయమని, వివక్షాపూరితమని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కారణంగా సదరు చార్జ్‌ను ఉపసంహరించుకోవాలంటూ నేషనల్ హెల్త్ సర్వీసెస్ కింద సేవలందిస్తున్న భారత సంతతి డాక్టర్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు లేఖ రాశారు.