Covid-19 Third Wave: కలవరపెడుతున్న కొత్త కేసులు.. త్వరలోనే కరోనా థర్డ్‌ వేవ్‌!

కరోనా సెకండ్ వేవ్ నుంచి దేశం ఇంకా తేరుకోనేలేదు.. ఇప్పటివరకు తగ్గుముఖం పట్టినా కొన్ని రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు ఆందోళనకు గురిచేస్తోంది.

Covid-19 Third Wave: కలవరపెడుతున్న కొత్త కేసులు.. త్వరలోనే కరోనా థర్డ్‌ వేవ్‌!
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 02, 2021 | 1:00 PM

Covid-19 Third Wave: కరోనా సెకండ్ వేవ్ నుంచి దేశం ఇంకా తేరుకోనేలేదు.. ఇప్పటివరకు తగ్గుముఖం పట్టినా కొన్ని రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు ఆందోళనకు గురిచేస్తోంది. పది రాష్ట్రాల్లో కోవిడ్ పాజిటీవిటీ రేటు 10 శాతం ఎక్కువగా ఉందని కేంద్రం తెలిపింది. పాజిటివిటీ రేటు అధికంగా నమోదవుతున్న జిల్లాల్లో కఠిన ఆంక్షలు అమలు చేయాలని మరోసారి రాష్ట్రాలకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్దేశించింది. 46 జిల్లాల్లో 10%కి పైగా, 53 జిల్లాల్లో 5-10% మధ్య పాజిటివిటీ రేటు ఉన్నట్టు పేర్కొంది. కరోనా కేసులు, పాజిటివిటీ రేటు పెరుగుతున్న 10 రాష్ట్రాల్లోని పరిస్థితులపై కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సమీక్షించింది.

భారతదేశంలో కోవిడ్ -19 ఇన్‌ఫెక్షన్లు కొత్త-చిన్నవి అయినప్పటికీ-అక్టోబర్‌లో గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉంది, ఇంతకు ముందు కేసుల సంఖ్య పెరుగుదలను ఖచ్చితంగా అంచనా వేసిన పరిశోధకులే చెబుతున్నారు. ఆగస్ట్‌లోనే థర్డ్‌ వేవ్‌ ప్రారంభమై.. అక్టోబర్‌ నాటికి గరిష్ఠ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది. హైదరాబాద్‌, కాన్పూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) ప్రొఫెసర్లు మతుకుమల్లి విద్యాసాగర్‌, మణీంద్ర అగర్వాల్‌ నేతృత్వంలోని పరిశోధనా బృందం కరోనా కేసుల పెరుగుదల థర్డ్‌ వేవ్‌కు దారి తీస్తుందని తెలిపింది. ప్రస్తుతం కేరళ, మహారాష్ట్రతో పాటు అధిక కోవిడ్‌ కేసులున్న రాష్ట్రాలను చూస్తే తెలుస్తోందని ప్రొఫెసర్‌ విద్యాసాగర్‌ బ్లూమ్‌బర్గ్‌కు ఈ-మెయిల్‌ ద్వారా తెలిపారు.

మతుకుమల్లి విద్యాసాగర్ నేతృత్వంలోని పరిశోధకుల అంచనాల ప్రకారం, అక్టోబర్ నాటికి దేశంలో కరోనా వ్యాప్తి మరింత పెరగవచ్చన్నారు. థర్డ్ వేవ్ అత్యుత్తమ పరిస్థితుల్లో రోజుకు 100,000 నుంచి 150,000 కంటే కేసులు నమోదయ్యే అవకాశముందని హెచ్చరించారు. మేథమేటికల్‌ మోడల్ ప్రకారం.. థర్డ్‌ వేవ్‌పై అంచనా వేశారు. భారత్‌లో మొదటి వేవ్? రెండో వేవ్ ఏ స్థాయిలో వచ్చింది? ఆ రెండింటి మధ్య ఎంత సమయం? ఇలా పలు కోణాలపై అధ్యయనం చేసి థర్డ్‌ వేవ్‌పై అంచనాలు రూపొందించినట్లు విద్యాసాగర్ పేర్కొన్నారు. మొదటి వేవ్‌ తర్వాత అక్టోబర్‌, నవంబర్‌ మధ్య కోవిడ్‌ నియమాలు పాటించకపోవడంతో ఈ ఏడాది మేలో భారీగా కేసులు పెరిగాయి. ప్రతి రోజు వేల మంది ప్రాణాలను బలిగొనగా.. మే 7న దేశంలో సెకండ్‌ వేవ్‌లో అత్యధికంగా 4,14,188 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ప్రభుత్వం తీసుకున్న చర్యలతకు తోడు వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టింది. అయితే, మేథమేటికల్ మోడల్‌ మేరకు.. దేశంలో వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని, హాట్‌స్పాట్లలో ట్రాకింగ్‌ పద్ధతులు అమలు చేయాలని, కొత్త వేరియంట్‌లు పుట్టుకువచ్చే అవకాశం ఉన్నందున జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ నిర్వహిస్తూ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

దేశంలోని దాదాపు 1.4 బిలియన్ ప్రజలలో అధిక స్థాయి సహజ రోగనిరోధక శక్తి పెరిగిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని వల్ల తదుపరి వచ్చే థర్డ్ వేవ్ మహమ్మారి ప్రభావాన్ని కొత్త వరకు తట్టుకోగలదని అధ్యయనంలో పేర్కొన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ద్వారా జాతీయ యాంటీబాడీ సర్వే గత నెలలో జరిగిన అధ్యయనంలో ఆరు సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న భారతీయులలో మూడింట రెండు వంతుల మంది కరోనావైరస్ బారిన పడినట్లు కనుగొన్నారు.

ఇదిలావుంటే తాజాగా ఇండియాలో నమోదైన కేసులను పరిశీలిస్తే.. మరోసారి వైరస్ ప్రభావం ఉండే అవకాశముందని స్పష్టమవుతోంది. కొత్తగా 40,134 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 3,16,95,958కి చేరింది. దేశంలో కరోనాతో కొత్తగా 422 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 4,24,773కి చేరింది. మరణాల రేటు 1.3 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో ఇది 2.13 శాతంగా ఉంది. ప్రస్తుతం ఇండియాలో యాక్టివ్ కేసులు 2.77 వేలకు పెరిగాయి. ఇవి వరుసగా ఆరో రోజు పెరుగుదల నమోదు చేసుకోవడం ఆందోళన కలిస్తోంది. అలాగే… కొత్త కేసులు వరుసగా ఆరో రోజు 40 వేల కంటే ఎక్కువ వచ్చాయి. నిన్న దేశంలోనే అత్యధికంగా కేరళలో కొత్త కేసులు 20.73వేలు రాగా… మహారాష్ట్రలో 6.48వేలు, ఆంధ్రప్రదేశ్‌లో 2.29వేలు వచ్చాయి. నిన్న దేశంలోనే ఎక్కువగా మహారాష్ట్రలో 157 కొత్త మరణాలు రాగా ఆ తర్వాత ఒడిశాలో 64, కేరళలో 56 వచ్చాయి. నిన్న కొత్త కేసుల్లో 51.6 శాతం కేరళలోనే వచ్చాయి. దీంతో ఇండియాలోని మొత్తం యాక్టివ్ కేసుల్లో 40.6 శాతం కేరళవే కావడం విశేషం. అవి మహారాష్ట్రతో పోల్చితే రెట్టింపు కంటే ఎక్కువగా ఉన్నాయి. మొత్తం యాక్టివ్ కేసుల్లో కేరళ, మహారాష్ట్ర కలిపి… 60.5 శాతం ఉన్నాయి. ప్రస్తుతం 17 రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాల్లో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి.

మరోవైపు, పొరుగు రాష్ట్రాలైన కేరళ, మహారాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రం అప్రమత్తమైంది. కర్ణాటకలో కరోనా కట్టడికి రాష్ట్ర సరిహద్దుల్లో సోమవారం నుంచి చెక్ పాయింట్లను ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేసింది. కరోనా పీడిత కేరళ, మహారాష్ట్రల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘాకు ప్రభుత్వం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. కేరళ, మహారాష్ట్రలో నుంచి బెంగళూరు వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు జరపాలని బృహత్ బెంగళూరు మహానగరపాలిక అధికారులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. బెంగళూరు నగరంలోని జోనల్ కమిషనర్లు, ఇన్ స్పెక్టర్లు, రెవెన్యూ డిపార్టుమెంట్ సిబ్బంది అన్ని ఎంట్రీ పాయింట్లలో ప్రయాణికులను తనిఖీలు చేయాలని చీఫ్ కమిషనర్ ఆదేశించారు.

ప్రయాణికుల వద్ద 72 గంటలకు ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ చూపించాలని, లేకుంటే వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని ఆదేశించారు.రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు, మైసూర్ రోడ్ శాటిలైట్ బస్ టెర్మినల్, యశ్వంత్ పూర్ రైల్వేస్టేషన్, కెంగెరి శాటిలైట్, శివాజీనగర్ బస్ టెర్మినల్, కంటోన్మెంట్, కేఆర్ పురం రైల్వేస్టేషన్లు వచ్చే ప్రయాణికులను తనిఖీలు చేయాలని నిర్ణయించారు.కర్ణాటకలో ఆదివారం 1875 కరోనా కేసులు నమోదు కాగా 25 మంది మరణించారు. దీంతో కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై అధికారులను ఆదేశించారు.

Read Also…  

Reliance Retail: ఫుడ్‌ ఇండస్ట్రీపై కన్నేసిన రిలయన్స్‌.. వణికిపోతున్న డొమినోస్‌, కేఎఫ్‌సీ

ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!